Divvela Madhuri Comments Roja: తెలుగు రాష్ట్రాల్లో మహిళా సెలబ్రిటీల్లో ఒకరు దివ్వెల మాధురి( Madhuri). ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సహచరిగా, తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు మాధురి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే తత్వం ఆమె సొంతం. ఈ క్రమంలో ఆమె మాజీ మంత్రి రోజాపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. నేను చేస్తే మీకు రోతలా కనిపిస్తుందా? మాజీ మంత్రి చేస్తే ముద్దుగా ఉందా? అంటూ చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక నటిగా, హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన రోజాను అలా అనడం.. అంతేకాకుండా ఆమెకు తాము తక్కువ కాదు అని గట్టి హెచ్చరికలు పంపారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఉండగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: Pawan Kalyan Report Card : పవన్ కళ్యాణ్ పాలన రిపోర్ట్ కార్డు ఎలా ఉంది?
సంచలన కామెంట్స్
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్( Srinivas), దివ్వెల మాధురి జంట పలు వేదికల మీద జంటగా డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో సైతం జంటగా రీల్స్ చేయడం కామన్ గా మారింది. మాధురి స్వతహాగా డాన్సర్. ఆమె వేసే డాన్స్ కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వీరిద్దరూ జంటగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావిస్తూ.. ఇద్దరు కలిసి డాన్స్ లు వేయడం, అవి వైరల్ కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారట కదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దువ్వాడ శ్రీనివాస్ సైలెంట్ గా ఉన్నారు. మాధురి మాత్రం ఓ రేంజ్ లో ఇచ్చి పడేశారు.
Also Read: Jaganmohan Reddy : దువ్వాడ శ్రీనివాస్ పై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం.. కీలక నిర్ణయం.. సత్వర ఆదేశాలు
రోజా ప్రస్తావనతో..
ప్రత్యేకంగా మాధురి మాజీ మంత్రి రోజా( RK Roja) ప్రస్తావన తీసుకొచ్చారు. తామిద్దరం చేస్తే తప్పు, అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా స్టెప్స్ వేస్తే ఆహా ఓహో అంటారు అంటూ ఫైర్ అయ్యారు. టీవీ షోలో మంత్రి రోజా డాన్స్ చేయలేదా అంటూ ప్రశ్నించారు. తాము రీల్స్ చేయడమే సస్పెండ్ కు కారణం అయితే.. పార్టీలో చాలామందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పార్టీ కోసం దువ్వాడ శ్రీనివాస్ పని చేశారని.. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటూ సెటైరికల్ గా మాట్లాడారు మాధురి. అదో గాలి పార్టీగా అభివర్ణించారు. అదెప్పుడో కొట్టుకుపోయింది అని వ్యాఖ్యానించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
