Hyderabad to Visakhapatnam distance: రాష్ట్ర విభజన కానీ.. తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. భాగ్యనగరంలో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఏపీ వైపు దూసుకొచ్చే వాహనాలను చూస్తేనే అర్థమయిపోతోంది ఈ విషయం. అయితే బస్సులు,, రైళ్లు, విమానాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా లోటే. అయితే పెరిగిన రవాణా భారంతో చాలామంది సొంతంగానే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కారు కనిపిస్తోంది. అదే సమయంలో రహదారులు కూడా మెరుగవుతున్నాయి. అయితే తెలంగాణ నుంచి ఏపీకి జాతీయ రహదారులు ఉన్నాయి. అయినా సరే రద్దీ తగ్గడం లేదు. ముఖ్యంగా హైదరాబాదు నుంచి విశాఖ రావాలంటే చాలా కష్టం. అటువంటి వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్- విశాఖపట్నం ల మధ్య ప్రయాణం ఐదు గంటలపాటు తగ్గనుంది.
తగ్గనున్న ప్రయాణ భారం..
సాధారణంగా ప్రయాణ సమయం బట్టి టిక్కెట్ ధరలు ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు తగ్గితే అంతగా టిక్కెట్ ధరలు తగ్గుతాయి. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి రావడం ద్వారా ఏకంగా ఐదు గంటల సమయం ఆదా అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. బస్సు టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి. పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు వేగవంతంగా జరగనున్నాయి.
చాలా అనుకూలం..
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ – విశాఖ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాదు నుంచి విశాఖ వెళ్లే వారికి ఈ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది. విజయవాడ నగరం వెళ్లాల్సిన పనిలేదు. నేరుగా విశాఖకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు పొడవు 162.10 కిలోమీటర్లు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 56.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుమారు రూ.4609 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 125 కిలోమీటర్ల దూరం హైదరాబాద్, విశాఖ నగరాల మధ్య తగ్గనుంది.