Vijay Sai Reddy : అకస్మాత్తుగా వైసీపీ పార్టీ కి కుడిభుజం లాగా ఉండే విజయసాయిరెడ్డి ఆ పార్టీ కి కాసేపటి క్రితమే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటి?, వేరే పార్టీ లో చేరుతానని కూడా చెప్పలేదు, శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని, ఇక నా భవిష్యత్తు కేవలం వ్యవసాయం కి మాత్రమే అంకితం అంటూ చెప్పుకొచ్చిన ఆయన, టీడీపీ తో రాజకీయంగా మాత్రమే విభేదించానని, చంద్రబాబు కుటుంబం తో ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని, పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడని చెప్పుకొని రావాల్సిన అవసరం ఏముంది?, భవిష్యత్తులో ఈ రెండు పార్టీలలో చేరే అవకాశం ఉందా?, లేకపోతే బీజేపీ పార్టీ లోకి వెళ్ళబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడానికి అసలైన కారణం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత ఏడాది డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు లో అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ ఉన్న నౌక స్టెల్లా ని సముద్రం మధ్యలోకి వెళ్లి అడ్డుకొని, ‘సీజ్ ది షిప్’ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడైతే అక్రమ రవాణా ని అడ్డుకున్నాడో అప్పటి నుండి తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరు చేసిన అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఆ అక్రమార్కుల లిస్ట్ లో విజయ్ సాయి రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్రమ రవాణా కేసు లో ఈడీ పలువురు కీలక వ్యక్తులను విచారిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ ఒక రోజున విజయ్ సాయి రెడ్డి ని కూడా సుదీర్ఘంగా విచారించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. అనంతరం విజయ్ సాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి చాలా అగ్రెస్సివ్ అయ్యాడు.
పాత కేసులకు సంబంధించిన విచారణ కూడా ఈడీ అధికారులు చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా మీడియా కి గత కొద్దిరోజుల క్రితం తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒత్తిడిని తట్టుకోలేక, రాజకీయాల్లో ఒక పార్టీ తో ఉండడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి అనే భయంతోనే రాజీనామా చేశాడా అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కాకినాడ పోర్టుని వైసీపీ హయం లో మొత్తం తమ చేతుల్లోకి స్వాధీన పర్చుకొని, అరబిందో సంస్థకు ఎక్కువ వాటాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సాయి రెడ్డి పాత్ర కూడా చాలా పెద్దది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి కేవీరావు కి ఆ వాటాలు అరబిందో సంస్థ నుండి వచ్చేలా చేసింది. అదే విధంగా కేసు విచారణ లో ఈ విషయం లో కూడా విజయ్ సాయి రెడ్డి అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు ఉన్నందున వైసీపీ నుండి తప్పుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.