https://oktelugu.com/

CM Jagan – YS Sunitha: జగన్ కు ఆస్తి ఇవ్వకుండా సునీత మోసం చేసిందా?

వివేకా హత్యకేసులో నిందితులకు శిక్షపడాలని సునీత గట్టిగానే పోరాడుతున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామమే.

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2023 7:24 pm
    CM Jagan - YS Sunitha
    Follow us on

    CM Jagan – YS Sunitha: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చాలా రకాల విషయాలు బయటపడ్డాయి. ఇది రాజకీయ, కుట్ర కోణంలో మాత్రం జరిగింది కాదని.. ఆస్తి, ఇతరత్రా కారణాలు సైతం ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఎన్నికల ముందు వరకూ సైలెంట్ గా ఉన్న వివేకా కుమార్తె సునీత.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే బయటపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి శిబిరానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జగన్ రాజకీయ ప్రత్యర్థుల సహకారంతో న్యాయ పోరాటానికి పూనుకున్నట్టు వార్తలు వచ్చాయి.

    వివేకా హత్యకేసులో నిందితులకు శిక్షపడాలని సునీత గట్టిగానే పోరాడుతున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామమే. అయితే వివేకా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. సునీత న్యాయ పోరాటం చేయడం ప్రారంభించింది మాత్రం వైసీపీ అధికారంలోకి సుమారు ఏడాదిన్నర తరువాత. వివేకా హత్యతో రాజకీయ లబ్ధి పొందింది జగన్. అంతులేని సానుభూతి పనిచేసింది. రాజకీయ ప్రత్యర్థులే మట్టుబెట్టారని చెప్పడంతో ప్రజలు కూడా అయ్యోపాపం అన్నారు. అటు కుటుంబమంతా ఏకతాటిపై ఉండడంతో ప్రజలు వారు చెప్పింది నమ్మారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని.. అదే కుటుంబం వారు చెప్పడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

    ఈ కేసు విషయంలో సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ ఆమె కొంతకాలం తరువాత ఈ పని ప్రారంభించారు.అంటే ఈ మధ్యలో ఎన్నోరకాల వ్యవహారాలు నడిచాయి. అందులో ఆస్తి, కుటుంబ తగాదాలే ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండో భార్య, ఆమెకు పుట్టిన వారసుడే కారణమని తెలుస్తోంది. వివేకాతో షమీమ్ అనే మహిళకు 2010లో వివాహం జరిగింది. వారికి 2015లో షహన్షాన్ పుట్టాడు. వివేకా రెండో వివాహం కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. సునితతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఇది నచ్చలేదు. దీంతో తరచూ గొడవలు జరిగేవి.

    అయితే వివేకా హత్య జరిగిన తరువాత వైఎస్ కుటుంబం ఒకేతాటిపై ఉంది. అందరూ జగన్ ను సీఎం చేసేందుకు డిసైడయ్యారు. సునీత సైతం సైలెంట్ అయ్యారు. అయితే ఈ సైలెంట్ వెనుక వివేకా ఆస్తిని తనకు దఖలుపడేలా జగన్ చూస్తారని సునీత భావించారు. కానీ జగన్ సీఎం అయిన తరువాత ఆస్తిని రెండో భార్య కుమారుడికి కూడా ఇవ్వాలని ప్రపోజుల్ పెట్టారు. దీనిపై సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యేందుకు సహకరిస్తే ఇదా ఫలితమంటూ మధ్యవర్తుల ముందే సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచే ఆమె బయటకు వచ్చి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. జగన్ రాజకీయ ప్రత్యర్థుల సాయంతో గట్టిగానే పోరాడుతున్నారు. కేవలం జగన్ వివేకా ఆస్తి సెటిల్ చేసేందుకు ప్రయత్నించడమే కేసు బిగుసుకోవడానికి కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.