Chandrababu Sensational Comments: ఏ రంగంలో ఎదుగుదలకు అయినా పట్టుదల ఉండాలి. పరిశ్రమించాలి. అలా కష్టపడి వచ్చినవారే తాము అనుకున్నది సాధించగలరు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు చదువులో ముందుండేవారట. అయితే చదువులకంటే.. రాజకీయాలంటేనే ఇష్టపడి ఆ రంగంలోకి వచ్చారు. అనుకున్నది సాధించగలిగారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. అయితే తాజాగా ఆయన తన చదువు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రసీ వ్యవస్థను కంట్రోల్ చేయగలది రాజకీయ వ్యవస్థని నమ్మి ఈ రంగంలోకి వచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు సీఎం చంద్రబాబు.
విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి..
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం పూల పాన్పు కాదు. విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు ఆయన. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో రాజశేఖర్ రెడ్డి తో కలిపి స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ గా ఉండేవారు. అలా కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి 1978లో తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్కు అల్లుడై అలా టిడిపిలో చేరారు. అయితే ముందుగా ఎమ్మెల్యేగా కాకుండా పార్టీపై పట్టు పెంచుకున్నారు. అలా 1995లో తెలుగుదేశం పార్టీని హస్త గతం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదంతా మూన్నాళ్ళ ముచ్చట అనుకున్నారు అంతా. కానీ చంద్రబాబు తన సమర్థత, చతురతతో రాజకీయాల్లో ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. మంచి పాలనా దక్షుడిగా గుర్తింపు సాధించారు. ఎంతోమంది ఐఏఎస్ అధికారులు చంద్రబాబుతో పనిచేయాలని ఉంటుందని తమ మనసులోని మాటను వ్యక్తపరిచారంటే చంద్రబాబు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది.
మంచి పాలనా దక్షుడిగా..
చంద్రబాబు( CM Chandrababu) కేవలం రాజకీయ నాయకుడే కాదు. మంచి పాలనా దక్షుడు అని నిరూపించుకున్నారు. ఒక్క రాజకీయ నేతలతోనే కాదు ఎంతోమంది ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నారు. చంద్రబాబుతో పనిచేసేందుకు అధికారులు సైతం ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా విద్యార్థులతో అదే విషయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు చంద్రబాబు. వ్యవస్థలతో పాలన సాగించేందుకు తాను ఒక విజన్ రూపొందించుకున్నానని.. అటు విద్యార్థిగా కూడా క్లాస్ రూమ్ లో రెండో స్థానంలో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. కానీ వాటన్నింటికీ మించి రాజకీయాల్లోకి వెళితే.. అధికారుల ద్వారా పాలన సాగించవచ్చని.. ఒక మంచి అవకాశం దక్కించుకోవచ్చు అని భావించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వినడం విశేషం.
ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేయొచ్చు అని రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా.. అది నా విజన్ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/HJgDyTH8fL
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025