Pawan Kalyan 100-day plan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) మరోసారి తన సొంత నియోజకవర్గంలో నెలకొన్న సమస్యపై దృష్టి పెట్టారు. తద్వారా రాష్ట్రస్థాయిలో ఒక సమస్యకు పరిష్కార మార్గం చూపారు. కొన్ని రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. సముద్ర తీరప్రాంతాల్లో రసాయనిక పరిశ్రమల వల్ల మత్స్య సంపద చనిపోతోందని.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. అప్పట్లో ఈ ఆందోళనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ పై వైసీపీ అనుకూల మీడియా వ్యతిరేక ప్రచారం చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వంద రోజుల్లో ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీకి తగ్గట్టు ఇప్పుడు అడుగులు వేశారు. యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
వంద రోజుల ప్రణాళిక.. మత్స్యకారులకు( fisheries) సంబంధించి విశాఖలో ఉన్న ప్రాంతీయ కార్యాలయం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. తీరంలో మత్స్య సంపద పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయాలని కోరారు. మరోవైపు ఈ 100 రోజుల ప్రణాళికకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసేలా చేశారు. పరిశ్రమలు నుంచి వచ్చే రసాయనాల వల్ల మత్స్య సంపద చనిపోతుందన్న విమర్శలు ఉన్నాయి. అదే విషయం శాసనసభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని మనమే కోరుకుంటున్నామని.. ఇప్పుడు కాలుష్యం పేరిట పరిశ్రమలు మూస్తే సరిపోదని.. దీనికి ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపాలని అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మత్స్యకారుల సమస్యకు పరిష్కార మార్గం చూపించేందుకు రంగంలోకి దిగారు.
రాష్ట్రస్థాయి ఉద్యమంగా..
ఉప్పాడ( Uppada ) తీరంలో రెండు రోజులపాటు ఆందోళనకు దిగారు మత్స్యకారులు. అప్పట్లో ఇది రాష్ట్రస్థాయి ఉద్యమానికి దారితీస్తుందని అంతా భావించారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయం చేయాలని భావించింది. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. దీనిని ముందే గుర్తించిన పవన్ కళ్యాణ్ వంద రోజుల్లో దీనికి పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో వైసిపి అనుకూల మీడియాలో మరో సుగాలి ప్రీతి కేసు అంటూ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ సమస్య పరిష్కార మార్గాల కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిని మత్స్యకారులు కూడా ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఉన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.