Vizag Airport : సాధారణంగా ఎయిర్ పోర్ట్ లలో తనిఖీలు చేస్తారు. నిషేధిత వస్తువుల రవాణా జరుగుతుందని భావించి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇదే మాదిరిగా విశాఖ ఎయిర్పోర్టులో సైతం అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఒక బ్యాగ్ ను అలాగే స్కాన్ చేశారు. అలా స్కాన్ చేసినవారికి ఎక్కడో తేడా కొడుతోంది. సందేహం రావడంతో వెంటనే ఆ బ్యాగ్ అలా ఓపెన్ చేశారు. ఇక షాక్ ల మీద షాక్ లు. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగాయి. విశాఖ ఎయిర్ పోర్టుకు అప్పుడే విమానం వచ్చింది. అందులో నుంచి ప్రయాణికులు దిగారు. తమ లగేజీ బ్యాగులను సెక్యూరిటీ చెక్ కోసం వదిలేశారు. ఇంతలోనే కష్టం అధికారులు బిజీ అయ్యారు. అనుమానంతో ఓ బ్యాగు కనిపించేసరికి తెరిచారు. అందులో వింత జీవులు కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
* అనుమానాస్పదంగా ఓ బ్యాగు
అనుమానంతో కూడిన బ్యాగును స్కాన్ చేశారు తనిఖీ అధికారులు. కానీ ఆ బ్యాగులు ఏదో కదులుతున్నట్లు కనిపించాయి. ఓపెన్ చేసి చూస్తే అందులో బల్లులు కనిపించాయి. కానీ అవి సాధారణంగా మన ఇంట్లో కనిపించే బల్లులు కాదు. విదేశీ బల్లులు. మూడు నీలిరంగు నాలుక బల్లులు కాగా.. మరో మూడు విదేశీ బల్లులుగా కష్టం అధికారులు గుర్తించారు. మొత్తం ఆరు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఎవరు తెచ్చారా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
* అటవీ శాఖ అధికారుల సంరక్షణలో
ఇలా పట్టుబడిన బల్లులను ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. ఇంత ప్రమాదకరమైన బల్లులను అక్రమంగా భారత్ కు ఎలా తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎక్కడి నుంచి తెచ్చారు? అన్నది దర్యాప్తులో తేలనుంది. అయితే తొలుత ఈ బల్లులను చూసి కస్టమ్స్ అధికారులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వచ్చి అవి విదేశీ బల్లులని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ ఎయిర్పోర్టులో ప్రమాదకర బల్లులు
మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
థాయ్లాండ్ నుంచి అక్రమంగా బల్లులను భారత్కు తరలిస్తున్నట్లు సమాచారం
డీఆర్ఐ, అటవీ సర్వీస్ అధికారుల సంయుక్త తనిఖీల్లో గుర్తింపు
ఎయిర్పోర్టు… pic.twitter.com/0l49xLwslG
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2024