Cricket development in AP: క్రీడాకారుల ప్రోత్సాహం విషయంలో ఏపీ ప్రభుత్వం( AP government) ముందంజలో ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మాత్రం క్రీడాకారుల విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అంధ క్రికెటర్లను పిలిపించి వ్యక్తిగత సహాయం అందించారు పవన్ కళ్యాణ్. పేద కుటుంబాలు కావడంతో గృహోపకరణాలు, నిత్యవసరాలను సైతం అందించారు. తాజాగా మంత్రి నారా లోకేష్ టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీ చరణీ కి నగదు ప్రోత్సాహం అందించారు. 500 గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలాన్ని కూడా కేటాయించారు. ఇటీవల ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ లో రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు శ్రీ చరణీ.
అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్..
క్రికెట్ అభివృద్ధిలో ప్రత్యేక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతుంది. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్( International Sports Complex) నిర్మించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అందుకు అవసరమైన ఏ ఛాన్స్ విడిచిపెట్టడం లేదు నారా లోకేష్. క్రికెట్ పరంగా ఏపీ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున అందిస్తున్నారు. అయితే ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఐపీఎల్ లో ఏపీకి చెందిన క్రికెటర్ బాగా రాణించారు. తన విజయాన్ని మంత్రి నారా లోకేష్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారంటే… ఏపీ పాలకులు క్రికెటర్ల విషయంలో ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది.
ఐసీసీ అధ్యక్షుడితో సాన్నిహిత్యం..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు జై షా( jaisa) ఉన్నారు. ఆయన సహాయంతో ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు మంత్రి నారా లోకేష్. అందుకే ఆ మధ్యన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ విశాఖలో ప్రారంభమయ్యేలా చేశారు. ప్రారంభ మ్యాచ్ కు ఏపీ ఆతిథ్యం ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించారు. జై షా హాజరైన ఈ వేడుకకు మంత్రి నారా లోకేష్ సైతం హాజరయ్యారు. అదే ఫైనల్ మ్యాచ్ కు కుటుంబంతో సహా ముంబై వెళ్లారు. జై షా తల్లితో సమావేశం కావడం ద్వారా మంచి సంకేతాలు పంపించారు. అక్కడ సచిన్ టెండూల్కర్ ను సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇప్పుడు మహిళ క్రికెటర్ కు పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహం అందించారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం ఏపీలో క్రికెట్ అభివృద్ధి కోసమేనని స్పష్టమవుతోంది.