AP Covid19 cases: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ 5వేలలోపు నమోదైన కేసులు గడిచిన 24 గంటల్లో ఏకంగా 10వేలు దాటాయి. చూస్తుంటే థర్డ్ వేవ్ ఏపీలో ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపు డబుల్ కేసులు కావడం.. వైరస్ విస్తృతిని సూచిస్తోంది. దీన్ని బట్టి ఏపీలో కరోనా విజృంభిస్తోందని తెలుస్తోంది.
ఏపీలో ఒక్కరోజే 10వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10057 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనాతో ఏపీలోని విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 8మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1222 మంది పూర్తిగా కోలుకున్నారు.
Also Read: విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !
రాష్ట్రంలో ప్రస్తుతం 44935 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1827, చిత్తూరులో 1822 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో రోజురోజుకు కేసులు డబుల్ అవుతున్నా దృష్ట్యా థర్డ్ వేవ్ వచ్చేసిందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరిన్ని ఆంక్షలు తప్పవని అంటున్నారు. సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కేసుల స్థాయిలో ఇప్పుడు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?