Lata Mangeshkar Health Update: భారతీయ గాన కోకిల ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ లతా మంగేష్కర్ (92 ) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందట. కరోనా సోకినప్పటి నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె.. మరో పది రోజుల పాటు ఐసీయూలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వయసు రీత్యా ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని.. ఇన్‌ఫెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: లతా మంగేష్కర్ ఎక్స్ క్లూజివ్ హెల్త్ అప్ డేట్ !
కాబట్టి.. ఆమె ఆరోగ్యం విషయంలో అభిమానులు, స్నేహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, లతా గారి ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది అని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా కూడా తాజాగా క్లారిటీ ఇచ్చారు. లతా మంగేష్కర్ కి కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిసి ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
కాగా కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు. కాకపోతే, లతా గారి వయసును దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఆమెను ఐసీయూలో ఉంచినట్లు, లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.
మొత్తానికి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి బాగుంది.
Also Read: ఐసీయూలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్.. ఆందోళనలో ఫ్యాన్స్..!