Cm chandhrababu : చంద్రబాబు నాయుడు పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.1979 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అంచలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. టిడిపి అధినేతగా సుదీర్ఘకాలం వ్యవహరిస్తూ వచ్చారు.అయితే ఈ కాంగ్రెస్ ద్వారా అయితే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. అదే పార్టీని విభేదించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా మారారు.కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ఇండియా కూటమిగా ఉంది. వ్యతిరేక కూటమి అయిన ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. దీనికి జగన్ వైఖరి కారణం. గత ఐదేళ్లుగా జగన్ అనుసరించిన విధానాలతో.. చంద్రబాబు బెటర్ అన్న ఆలోచనలోకి వచ్చారు కాంగ్రెస్ నేతలు. ఏపీలో ప్రస్తుతం కూటమిని వ్యతిరేకిస్తోంది కేవలం వైసీపీ మాత్రమే. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇది ముమ్మాటికీ చంద్రబాబుకు కలిసొచ్చే కాలమే. గతంలో ప్రజల్లోనే చంద్రబాబుపై ఒక రకమైన వ్యతిరేక భావన ఉండేది. కానీ ఐదేళ్ల వైసిపి పాలన చూసేసరికి చంద్రబాబు లో ఉన్న పాలనా దక్షత బయటపడింది. మిగతా రాజకీయ పార్టీల్లో సైతం చంద్రబాబు పట్ల ఉన్న అభిప్రాయం మారింది. వామపక్షాలు టిడిపి కూటమి పాలన సవ్యంగా సాగాలని కోరుకుంటున్నాయి. నేరుగా ఆ పార్టీల నేతలు చంద్రబాబును కలిసి అభినందనలు కూడా తెలిపారు. సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. గత ఐదేళ్లుగా జగన్ తమను దగ్గరకు కూడా రానివ్వలేని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే తమను పిలిచి వినతి పత్రాలు తీసుకోవడానికి వారు ఆహ్వానిస్తున్నారు.
* రఘువీరారెడ్డి అభినందన
తాజాగా పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి చంద్రబాబు పాలనను మెచ్చుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రఘువీరారెడ్డి సీనియర్ మంత్రి. చంద్రబాబును వ్యతిరేకించే నేత కూడా. చిరకాల ప్రత్యర్థిగా కూడా నిలిచారు. అటువంటిదిసీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గ మడకశిరలో పర్యటించగా అభినందనలు తెలిపారు. ఎటువంటి ఆర్భాటం చేయకుండా, జన సమీకరణ లేకుండా సమావేశం నిర్వహించారని మెచ్చుకున్నారు. మడకశిర అభివృద్ధికి అవసరమైన శక్తియుక్తులను చంద్రబాబుకు ఆ భగవంతుడు కల్పించాలని కోరారు రఘువీరారెడ్డి. ఆయనచేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* గత కొద్ది రోజులుగా
చిరకాలం చంద్రబాబును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. కానీ తొలిసారిగా 2018లో కాంగ్రెస్ పార్టీతో జత కలిసింది టిడిపి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బిజెపితో విభేదించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించారు చంద్రబాబు. కానీ ఆ ప్రయోగం ఫలించలేదు. వికటించింది కూడా. అటు తరువాత కాంగ్రెస్ నుంచి జారుకున్నారు చంద్రబాబు. ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏలో చేరారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పట్ల వ్యతిరేక భావన ఏర్పరచుకోలేదు.
* జగన్ వైఖరితోనే
చంద్రబాబు విషయంలో ఈ తరహా సానుకూల వాతావరణం రావడానికి మాత్రం ముమ్మాటికి జగనే కారణం. కనీసం ఒక రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ తో పాటు వామపక్షాలను గౌరవించలేదు. 2014లోప్రతిపక్షంలో ఉన్న వైసిపి.. తోటిపక్షాలుగా కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం.. గౌరవించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీని పురుగు కంటే హీనంగా చూశారు. వామపక్షాల ఉద్యమాలను అణచివేశారు. అందుకే ఇప్పుడు తమకు ప్రత్యర్థి అయిన బిజెపి కూటమిలో ఉన్నా.. చంద్రబాబును ఆ రెండు పార్టీలు గౌరవించడానికి అదే కారణం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Congress and left parties who are fans of chandrababu jaganas reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com