Chandrababu : అరేయ్.. ఏంట్రా ఇదీ.. బాబుకే ‘బూతు’ చూపిస్తారా? విజనరీ ఏం కావాలి రా స్వామీ! వైరల్ వీడియో

ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. గత ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కాలంలో జరిగిన తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముందుగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ లో చోటు చేసుకున్న అవకతవకలను ఆయన వివరించడం ప్రారంభించారు.

Written By: Bhaskar, Updated On : July 16, 2024 8:14 pm
Follow us on

Chandrababu :  ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. టిడిపి, బిజెపి, జనసేన ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీకి 11 స్థానాలను మాత్రమే మిగిల్చింది. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక కేంద్రంలో బిజెపికి ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. కూటమిలోని ఎంపీలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో 10 సంవత్సరాల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బిజెపికి మద్దతు ఇచ్చిన టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత..

ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. గత ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కాలంలో జరిగిన తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముందుగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ లో చోటు చేసుకున్న అవకతవకలను ఆయన వివరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏదో బూతు బొమ్మలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ కు గురయ్యారు. “ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే విషయంలో ఒళ్ళు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి” అంటూ అధికారులను హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. దీనిని వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి.

జరిగింది వేరా?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వీడియోలను సృష్టించడం, ఉన్న వీడియోలకు వక్రభాష్యాలు అద్దడం పరిపాటిగా మారింది. అయితే చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు.. అలాంటి కార్టూన్ బొమ్మ రాలేదని టిడిపి నాయకులు అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో.. కాస్త అంతరాయం ఏర్పడిందని.. దానిని వైసీపీ శ్రేణులు అనుకూలంగా మార్చుకొని.. వేరే చిత్రాలను అందులో పొందుపరిచాయని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఇటీవల ఎన్నికల్లో జగన్ ను ఇలా చేసే.. కొంతమంది వైసీపీ కార్యకర్తలు అభాసుపాలయ్యారని.. అధికారం కోల్పోయినప్పటికీ వారికి బుద్ధి రావడం లేదని టిడిపి నాయకులు అంటున్నారు.

నష్టం జరిగిపోయింది

టిడిపి శ్రేణులు స్పందించే లోగానే ఆ మార్ఫ్ డ్ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయింది. దీనిపై టిడిపి సాంకేతిక బృందం రెస్పాండ్ అయ్యే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే టిడిపి నాయకులు ఈ వీడియో కు వ్యతిరేకంగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. “ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో వైసీపీ శ్రేణులు బాధలో ఉన్నాయి. ఇలాంటప్పుడే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు ఎదురుచూస్తున్నట్టుగానే చంద్రబాబు వీడియో ఆయాచిత వరంలాగా మారింది. వారికి నచ్చినట్టుగా ఆ వీడియోను రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాకు కావాల్సింది సంచలనం మాత్రమే. నిజం, అబద్ధం అనేవి అవసరం లేదు. ఈ విషయంలో వైసిపి సోషల్ మీడియా విభాగం అంచనా వేసినట్టుగానే ఫలితం వచ్చింది. ఈ విషయంలో టిడిపి కాస్త వెనుకబడింది. అందువల్లే అధికార పార్టీ నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఒక ఉదాహరణగా తీసుకొని టిడిపి సోషల్ మీడియా విభాగం చాలా అలర్ట్ గా ఉండాలి. లేకుంటే ప్రజలు అలాంటి వాటిని వాస్తవాలు నమ్మే అనే ప్రమాదం ఉందని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.