Nandamuri family : బాలయ్యతో  కోల్డ్ వార్.. డోంట్ కేర్ అంటున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ 

 ఇటీవల బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతటి ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గైర్హాజరు హాట్ టాపిక్ అవుతోంది.

Written By: Dharma, Updated On : September 3, 2024 2:39 pm

Nandamuri family

Follow us on

 Nandamuri family  : నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తోందా? అది ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదా? అది మరింత పెద్దదవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్యతో వారికి భారీ గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకలకు ఆ ఇద్దరు గైర్హాజరయ్యారు. ఒకరు కుటుంబంతో కలిసి ఆలయ సందర్శనలో ఉండగా.. మరొకరు స్థానికంగా ఉన్నా డుమ్మా కొట్టారు. దీంతో వారి మధ్య విభేదాలు తగ్గలేదని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో భారీ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. తెలుగు చిత్ర ప్రముఖులతో పాటు తమిళ పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వచ్చిన వారంతా బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. బాలకృష్ణ లో ఉన్నహీరో లక్షణాలను ప్రస్తావించారు. అయితే ఈవెంట్ కు నందమూరి కుటుంబమంతా హాజరైనా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
 * తారాస్థాయికి విభేదాలు 
 నందమూరి బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం. ఇది చాలా సందర్భాల్లో చూశాం. నందమూరి బాలకృష్ణను చూసి ఒక వేదికపై తారక్ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అంతటి బంధం ఉన్న వారి మధ్య విభేదాలు వచ్చాయి అన్నది ఎప్పటి నుంచో ఒక ప్రచారం.అందుకు తగ్గట్టుగానే వారి నడవడిక కూడా ఉంది.తారకరత్న సంస్మరణ సభలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడే ఉన్న బాలకృష్ణ పెద్దగా పట్టించుకోని దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అటు కుటుంబ విషయాల్లో కూడా వారిద్దరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.
 * అన్నింటికీ గైర్హాజరు 
 నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు గత ఏడాది ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలకు వారికి ఆహ్వానించినా ఆ ఇద్దరు హాజరు కాలేదు. తమిళ పరిశ్రమకు చెందిన రజనీకాంత్ హాజరయ్యారు. అటు తరువాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ పొడిపొడిగానే స్పందించారు. వైసిపి చర్యలను తప్పు పట్టలేదు. ఎన్టీఆర్ తో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డిని లెజెండ్రీ పర్సన్ గా  పోల్చారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా ఖండించలేదు. అటు తరువాత చంద్రబాబు అరెస్టు సమయంలో సైతం స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ నందమూరి, నారా కుటుంబంతో ఆ ఇద్దరినీ దూరం చేశాయి అన్నది  ఒక ప్రచారం అయితే మాత్రం ఉంది.
 * బాలకృష్ణ పక్కన పెట్టారా?
 మరోవైపు అల్లుడు లోకేష్ కోసమే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు. స్వయంగా నందమూరి కుటుంబ సభ్యులు వెళ్లి ఆ ఇద్దరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ అన్నదమ్ములిద్దరూ వేదిక వద్ద కనిపించలేదు. తన తల్లి శాలిని, భార్య ప్రణతితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తుండడంతో ఈవెంట్ కు రాలేదంటున్నారు. కళ్యాణ్ రామ్ అయితే హైదరాబాదులో ఉన్నా
.. కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మొన్ననే ఓ విషయంలో ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ స్పందించారు. అది వారిద్దరి విషయంలోనని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ సొంత కార్యక్రమానికి వారు హాజరు కాకపోవడంతో.. ఎలా స్పందిస్తారో చూడాలి.