AP Weather: ఆంధ్రప్రదేశ్ కు తుపాన్ గండం పొంచి ఉంది. రెండు రోజుల క్రితం తమిళనాడు తీరం దాటిన వాయుగుండం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను ప్రభావితం చేయనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు రోజుల క్రితం తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలతోపాటు గోదావరి, కోస్తా జిల్లాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

అండమాన్ నికోబార్ తీరం వద్ద 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంది. సోమవారం వాయుగుండంగా మారి తీరం వైపు పయనిస్తోంది. 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి 18న దక్షిణ కోస్తాను తాకనుంది. జవాద్ తుపాన్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: మరో మూడు రోజులు: తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్
ఇది విశాఖపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ తీరానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. తుపాన్ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం చూపనుంది. 15నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది.
Also Read: ప్రజలకు హెచ్చరిక.. ముంచుకొస్తున్న వర్షాలు, సునామీలా వరద
గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఈశాన్య గాలులు వీస్తాయని తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.