CM Chandrababu: ఇటీవల చంద్రబాబు( Chandrababu) విషయంలో బిజెపిలో మార్పు కనిపిస్తోంది. జాతీయస్థాయిలో అన్ని అంశాల్లో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రాధాన్యమిస్తున్నారు కేంద్ర పెద్దలు. ఎన్డీఏ పరంగా కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు. మొన్న ఆమధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. కానీ సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణంతో చంద్రబాబు వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే ఈసారి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆహ్వానించింది. దీంతో బిజెపి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఫిబ్రవరి 1 ఢిల్లీలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే తెలుగు అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
* పది లక్షల మంది తెలుగు జనాభా
ఢిల్లీ ( Delhi)అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచారపర్వం ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో తెలుగు వారి ప్రభావం అధికమే. దాదాపు పది లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి ఢిల్లీలో పోరు హారాహోరిగా ఉంది.
* ఏపీకి ప్రాధాన్యం
అయితే బిజెపి( BJP) ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఏపీలోని తెలుగుదేశం పార్టీ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం కేంద్ర పెద్దలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో అందరి దృష్టి ఏపీపై ఉంది. మరోవైపు ఢిల్లీలో ఆప్ ఆధి పత్యానికి గండి కొట్టాలని బిజెపి భావిస్తోంది. ఎలాగైనా ఢిల్లీలో బిజెపి జెండా పాతాలని చూస్తోంది. అందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయాలని నిర్ణయించింది.
* చాలా టఫ్ ఫైట్
ఢిల్లీ ( Delhi)ఎన్నికల ఫలితాలను అనుసరించి దేశ రాజకీయాలు మారనున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరోవైపు ఆ పార్టీ పంజాబ్ కు కూడా విస్తరించింది. ఈ తరుణంలోనే ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సౌండ్ చేస్తున్నారు. బిజెపి తీరును ఎండ కడుతున్నారు. కొరకరాని కొయ్యగా మారారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ బిజెపి విజయం సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. కేజ్రీవాల్ అరెస్టుతో పొలిటికల్ మేనియా మారిపోయింది. అందుకే భారతీయ జనతా పార్టీ అక్కడ జాగ్రత్త పడుతోంది. చూడాలి మరి ఢిల్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.