CM Chandrababu: చంద్రబాబు( CM Chandrababu) మంచి పాలనా దక్షుడు.. ఇది ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం. ఆయన పాలనా తీరు అలా ఉంటుంది. యంత్రాంగాన్ని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఏ ప్రభుత్వంలోనైనా యంత్రాంగం కీలకం. యంత్రాంగం పనిచేస్తేనే అభివృద్ధి ఫలాలు సరిగ్గా అందుతాయి. ఈ ఫార్ములాను అనుసరించి తొలిసారిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు 1999లో అధికారంలోకి రాగలిగారు. తనకంటూ ఒక ముద్ర సాధించగలిగారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యంత్రాంగాన్ని నమ్ముకుని వారికి కీలక టాస్కులు ఇస్తారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తోంది అదే. అధికారులను మందలించగలరు.. వారిని ప్రోత్సహించగలరు కూడా. తాజాగా జిల్లా కలెక్టర్లు సదస్సులో అదే జరిగింది.
* నిత్యం సమీక్షలు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లను అమరావతికి రప్పించి సమీక్షిస్తున్నారు చంద్రబాబు. గత రెండు రోజులుగా అమరావతిలో కలెక్టర్లతో పాటు ఎస్పీ లతో సమీక్షలు జరిగాయి. ప్రజల్లో సంతృప్తి లేదని.. ఇంకా పాజిటివిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ల సదస్సులో తేల్చి చెప్పారు. మైనస్ పాయింట్లను సైతం గుర్తు చేశారు. తరువాత రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఓ ఆరుగురు కలెక్టర్ల పనితీరును ప్రశంసించారు. ఎస్పీల పనిని తీరును సైతం ప్రశంసించడమే కాదు వారికి పురస్కారాలు కూడా అందించారు. చంద్రబాబు పట్ల బ్యూరోక్రసీ వ్యవస్థకు ఒక గౌరవం ఉంటుంది. ఆయన ప్రోత్సహించిన తీరును ఎక్కువమంది ఫిదా అవుతుంటారు.
* ఆ ఫార్ములా తో..
అధికారుల్లో ఒకరిని ప్రశంసిస్తే మిగతావారు అనుసరిస్తారు. ఒకరి పనితీరును అభినందిస్తూ ప్రోత్సహిస్తే మురిసిపోతారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. అందుకే చంద్రబాబు ఈ ఫార్ములాను అనుసరిస్తున్నారు. అయితే ఆయన ఇలా చేయడం ఇదే కొత్త కాదు. చాలా సందర్భాల్లో దీనిని అనుసరించారు కూడా. చంద్రబాబు పాలనాపరంగా మెరుగైన స్థానాన్ని సాధించడం వెనుక అధికారులను ప్రోత్సహించిన తీరు ఉంది. వారితో ఎలా పనిచేయించుకోవాలో ఆయనకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే మందలించగలరు. వారితో పని చేయించుకోగలరు. ఆయన స్టైల్ ఎవరికీ రాదు కూడా.