https://oktelugu.com/

CM Chandrababu: మనవడు దేవాన్స్ టాలెంట్ కు ఫిదా అయిపోయిన చంద్రబాబు.. ఇంతకీ అతడు ఏం అద్భుతం చేశాడంటే

తాత రాజకీయ చదరంగంలో ఆరితేరారు. అదే ఒరవడిని సృష్టిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్. చెస్ లో మంచి ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

Written By:
  • Dharma
  • , Updated On : December 23, 2024 / 08:39 AM IST

    CM Chandrababu(5)

    Follow us on

    CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మనవడు సరికొత్త రికార్డు సాధించాడు. చెస్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న దేవాన్ష్ వేగవంతమైన చెక్ మేట్ సాల్వార్ 175 పజిల్స్ ను సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మంచి సర్టిఫికెట్ అందడంతో నారా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మనవడి ప్రతిభను అభినందిస్తూ చంద్రబాబు ఈ పోస్ట్ పెట్టారు. అలాగే తల్లిగా ఎంతో ఎమోషన్ కు గురయ్యానని నారా బ్రాహ్మణి సైతం పోస్ట్ చేయడం విశేషం.

    * చదరంగంలో ప్రోత్సాహం
    9 సంవత్సరాల దేవాన్ష్ ఇటీవల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇష్టం. దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. ఈ క్రమంలో చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొన్న లోకేష్ వేగవంతంగా పావులు కదిపాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికలను పరిష్కరించి దేవాన్ష్ ఈ రికార్డు సాధించాడు. తన వ్యూహాత్మకమైన ఆట తీరు, మంచి ప్రదర్శనతో చెక్ మేట్ మారథన్ అనే పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దాంతోపాటు మరో రెండు ప్రపంచ రికార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 45 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను మెరుపు వేగంతో సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించారు.

    * కొన్ని వారాలుగా కృషి
    ప్రపంచ రికార్డు ఈవెంట్ కోసం దేవాన్ష్ కొన్ని వారాలుగా కృషి చేస్తున్నాడు. రోజుకు 5 నుంచి 6 గంటల వరకు శిక్షణ పొందుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి అనే కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గత కొద్ది రోజులుగా ఈవెంట్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే తాత చంద్రబాబు తో మాట్లాడాడు. ఈ ఛాంపియన్షిప్ తో పాటు టాస్క్ జరుగుతున్న సమయంలో తన పక్కనే ఉండాలని కోరాడు. అయితే ఏపీ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఈ సమయంలో చంద్రబాబు వెళ్లడానికి కుదరలేదు. అయినా సరే దేవాన్ష్ చెస్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. నారా కుటుంబంలో ఆనందోత్సవాలు నింపాడు.