CM Chandrababu Kuppam Projects: చంద్రబాబుకు రాజకీయ జీవితం లేకుండా చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో ఆయనకు చెక్ చెప్పాలని భావించారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్..ఇలా ఒక్కటి వదల్లేదు. అందుకే 2029 ఎన్నికల్లో కుప్పం మాదే అన్నట్టు వ్యవహరించారు. కానీ అది వాపే కానీ..బలుపు కాదు అన్నట్టు రుజువు చేశారు కుప్పం ప్రజలు.అయితే జగన్మోహన్ రెడ్డికి కుప్పం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు. ఏదైనా డెవలప్ మెంట్ సోర్సెస్ చూపించుకుంటే ఫర్వాలేదు.. ముఖాన రెవెన్యూ డివిజన్.. ఆపై సంక్షేమ పథకాలు అంటూ చూపించారు. కానీ ప్రజలు దానిని విశ్వషించలేదు.
* ఆ అవమానాలను అనుకూలంగా..
ఏదైనా ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చూపించారో చెప్పలేం.. కానీ చంద్రబాబు చూపించారు. సుదీర్ఘ కాలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తనకు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎదురైన పరాభవాన్ని స్థానిక ప్రజలకు చూపించారు. ఓ మాజీ ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే వైఎస్సార్సీపీ చూపిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. బాబుగారిని ఇంత ఇబ్బందిపెడతారా అని కుప్పం నియోజకవర్గం ప్రజలు గుర్తించేలా బాధపడ్డారు చంద్రబాబు. వారికి కనువిప్పు కలిగించగలిగారు. జగన్ మాత్రం వారికి కంటగింపుగా మారారు.
* జగన్ వైఖరి తేటతెల్లం..
2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకం. ఆయనిచ్చిన ఒకే ఒక ఛాన్స్ కు అవకాశమిచ్చారు. ఖడ్గం సినిమాలో హీరోయిన్ సంగీత మాదిరిగా ఒక ఛాన్స్ అంటూ అమాయకపు మాటలకు అంతా జాలిపడతారు. చుట్టూ ఉన్నవారు మోసపోతారు. ఆమెను ఇష్టపడే రవితేజా సైతం అమాయకపు ఆడది అని నమ్ముతాడు. కానీ తరువాత ఆమె వ్యవహార శైలి తెలుస్తుంది. అట్టే జగన్మోహన్ రెడ్డి వైఖరి కుప్పం ప్రజలకే కాదు.. ఏపీ వాసులకు తెలిసిపోయిందన్న మాట. సినిమాతో పోల్చడం అతి అయినా.. ఒకే ఛాన్స్ అన్న స్లోగన్ సెట్ అవుతుందని భావించి అలా పోల్చాల్సి వచ్చింది.
* రికార్డ్ స్థాయిలో ప్రాజెక్టులు..
అయితే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు.. జగన్ నేర్పిన గుణపాఠాలనే తనకు అనుకూలంగా మార్చుకున్నారు బాబుగారు. కుప్పంకు ఏంచేయలేని బాబు అని మరోసారి స్లోగన్ వినిపించకుండా చేయాలనుకున్నారు. వేల కోట్ల రూపాయలతో ఒకేసారి ఏడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో రాష్ట్రంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. అందులో చంద్రబాబు వర్కవుట్ అయ్యేలా కనిపిస్తున్నారు.