Chandrababu-Pawan Kalyan Viral Video: ఏపీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం ప్రారంభం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఈ పథకం లాంఛనంగా ప్రారంభం అయినట్లు అయింది. రాష్ట్రంలో ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చారు. ప్రీమియర్ సర్వీసులలో ఆ అవకాశం లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఇచ్చారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు చేసి చూపించారు.
పథకం ప్రారంభం..
ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడ సిటీ టెర్మినల్ బస్ కాంప్లెక్స్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు బస్సులోనే వెళ్లారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. బస్సు వెళ్లే మార్గంలో కూటమి పార్టీల శ్రేణులు భారీగా బాణాసంచా కాల్చాయి. తీన్మార్ డాన్స్ లతో సందడి చేశారు. ప్రతి సెంటర్లో థాంక్యూ సీఎం సార్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.
మహిళల్లో ఆనందం..
రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 73% బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. అయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు విషయంలో మహిళలకు అవగాహన ఉంది. కానీ ఎక్స్ప్రెస్ సర్వీసుల విషయంలో అంతగా ఉండదు. అందుకే ఎక్స్ప్రెస్ ఉచిత ప్రయాణానికి సంబంధించి భారీ స్టిక్కర్ అతికిస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన చిత్రాలను జతపరుస్తున్నారు. మొత్తానికి అయితే ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభం కావడంతో మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అయితే రేపటి నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కలగనుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఉచిత పథకం అమలవుతున్న రాష్ట్రాలలో ఇబ్బందుల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టారు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్
ఏపీలో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించడానికి మహిళలతో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ pic.twitter.com/IVA3eyGiCz
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025