Chittoor TDP Politics: చిత్తూరు జిల్లాకు( Chittoor district) చెందిన ఓ యువ ఎమ్మెల్యే పై నిఘా ఉందా? ఆయన మూలంగా కూటమిలో ఇబ్బందులు వచ్చాయా? అందుకే ఆయన వ్యవహార శైలిపై నిఘా వర్గాలు కన్నేశాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబుకు సమకాలీకుడు అయిన ఓ నేత వారసుడికి టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచారు. కానీ గెలిచిన నాటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధినేత హెచ్చరించిన ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పుడు కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇబ్బందులు తెచ్చేలా ఆయన వ్యవహార శైలి ఉంది. అందుకే ఆయనపై అనుమానపు చూపులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? లేకుంటే ప్రత్యర్థులతో చేతులు కలిపారా? అనే దానిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
తండ్రి అకాల మరణంతో..
తండ్రి అకాల మరణంతో వారసుడిగా ఆయన కుమారుడు తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. కానీ గత ఏడాది కూటమి హవాతో ఆయన రెండోసారి పోటీ చేసి గెలిచారు. కానీ తన ప్రవర్తనతో తొలి ఆరు నెలల్లోనే వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో హై కమాండ్ ( high command) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తన తీరును మార్చుకోవాల్సి వచ్చింది. అటు తరువాత అనుకూల మీడియాను సైతం నిందించారు. ఇసుక, మద్యం వ్యవహారాల్లో వేలు పెట్టారు. దీంతో పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. మరోసారి టిడిపి హై కమాండ్ మందలించి పంపించింది.
Also Read: Chittoor Peddi Reddy: చంద్రబాబుకు చిక్కని చిత్తూరు!
ఓ మహిళా నేత వివాదంలో
అయితే ఇటీవల ఆ నియోజకవర్గంలో పెద్ద వివాదం నడిచింది. కూటమికి చెందిన మహిళా నేత ఒకరు ఆ ఎమ్మెల్యే పై నిఘా పెట్టారు. అయితే రివర్స్లో ఆ ఎమ్మెల్యే ఆమెపైనే గురి పెట్టారు. ఈ క్రమంలో ఓ హత్య కేసులో ఆమె చిక్కుకున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూటమి పార్టీల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆ ఎమ్మెల్యే పై ప్రత్యేకంగా నిఘా కు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రంగంలోకి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు..
అసలు ఆ ఎమ్మెల్యే ఉద్దేశం ఏమిటి? ప్రజలతో మమేకమై పని చేస్తున్నారా? లేకుంటే వ్యక్తిగత వ్యవహారాలతో గడుపుతున్నారా? ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపారా? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు( CMO officers ) రంగంలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన పార్టీలో యువనేత వర్గం గా ముద్ర పడింది. అయితే లేనిపోని వివాదాలలో సదరు ఎమ్మెల్యే చిక్కుకోవడం మాత్రం ఆయన వర్గంలో అలజడి రేగుతోంది. మున్ముందు ఆ ఎమ్మెల్యే విషయంలో టిడిపి హై కమాండ్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?