Chiranjeevi: చంద్రబాబుకు ఎల్లో మీడియా నిత్యం అతికించే ట్యాగ్ ఐటీ సృష్టికర్త. అసలు దేశంలో చంద్రబాబు వచ్చిన తరువాతే ఐటీ రూపాంతరం చెందిందని.. సమాచార విప్లవం సృష్టించింది చంద్రబాబేనంటూ ఎప్పుడు కితాబినిస్తుంటుంది. సైబరాబాద్ సృష్టికర్త. ముందుచూపుతో వ్యవహరించే దార్శనికుడు అంటూ పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతుంటుంది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన మదాపూర్ లోని సైబర్ టవర్ భవనాన్ని పూర్తిచేయడం చంద్రబాబుకు అనివార్యంగా మారింది. దేశ చరిత్ర గమనంలో ఎంతో మంది విదేశీ ప్రజాప్రతినిధులు భారత్ పర్యటనకు వస్తుంటారు. అందులోని అంతర్ భాగమైన రాష్ట్రాలను సందర్శిస్తుంటారు. అందులో భాగంగా వచ్చిన బిల్ క్లింటన్ తో పాటు ప్రముఖుల పర్యటనను చంద్రబాబు ఖాతాలో వేయడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయినట్టు ఎవరూ కాలేదు. చంద్రబాబు ఇంతటి ఖ్యాతికి ఎల్లో మీడియా ఒకరకమైన కారణం.
ఎప్పుడూ అవే ప్రకటనలు..
అయితే చంద్రబాబు తరచూ ఒక ప్రకటన చేస్తుంటారు. ఐటీ అభివృద్ధి చేసింది తానేనని చెబుతుంటారు. అటు సమాచార విప్లవానికి నాంది పలికింది తానేనని నిత్య ప్రకటన చేస్తుంటారు. అప్పుడెప్పుడో 90వ దశకంలో సెల్ ఫోన్లు ఏపీకి ఇంట్రడ్యూస్ చేసింది తానేనని చెబుతుంటారు. అయితే ఇందులో వాస్తవం ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. అంతకంటే ముందే ఏపీలో టాటా సెల్యూలర్ ఫోన్లు ప్రవేశించాయి. అందుకు సజీవ సాక్షం ఒకటి ఇటీవల వెలుగుచూసింది. మొదటి కొనుగోలుదారుతో సహా అన్ని వివరాలు బయటపడ్డాయి. ఇంతకీ మొదటి కొనుగోలుదారుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. పీవీ నరసింహరావు హయాంలో.. అంటే 1996 కంటే ముందే చిరంజీవి టాటా సెల్యూలర్ ను వాడారన్న మాట. అటువంటప్పుడు చంద్రబాబు తానే సెల్యూలర్ ఫోన్ ను ఇంట్రడ్యూస్ చేశారని చెబుతుండడం.. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుండడం దారుణం.ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఇలా హల్ చల్ చేస్తున్న పేపర్ క్లిప్పింగ్ సైతం ఎల్లోమీడియాదే కావడం విశేషం.

పాపం ఎల్లో మీడియా..
ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. తన ప్రసారాలకు, కథనాలకు, వార్తలకు పరామార్ధం ఒక్కటే. అదే తెలుగుదేశం విశాల ప్రయోజనాలు. వాటి కోసం ఈ మీడియా ఎంతకైనా తెగిస్తుంది. మరీ ముఖ్యంగా ఏబీఎన్ ఆర్కే రాతలు రోత పుట్టిస్తాయి. ఎదుటి వారిని మానసికంగా హింసిస్తాయి. తెలుగునాట ఎల్లో మీడియా బారిన పడి ఎంతో మంది మూల్యం చెల్లించుకున్నారు. వారికి కేవలం టీడీపీ అధికారంలో ఉండాలి… తాము డెవలప్ కావాలి. తమ సామాజికవర్గం హవా నడవాలి. అటువంటి ఆకాంక్షతోనే గడుపుతుంటారు. ప్రత్యర్థులపై విషయం చిమ్మే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆర్కేఇటువంటి రాతలతో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. వారికి సంబంధం లేకపోయినా.. వారే తనతో రాయిస్తున్నట్టు అర్ధం వచ్చేలా వ్యవహరిస్తుంటారు. మున్ముందు ఆర్కేను చంద్రబాబు నిలువరించకపోతే టీడీపీని కబళించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైరల్…
అయితే ఇప్పుడు టాటా సెల్యూలర్ ఫోన్ తో కనిపిస్తున్న చిరంజీవి పేపర్ క్లిప్ తెగ హల్ చల్ చేస్తోంది. ఇది కదా వాస్తవం అంటూ నెటిజన్లు ఎల్లో మీడియాకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడో పీవీ నరసింహరావు హయాంలో డెవలప్అయిన టెక్నాలజీని చంద్రబాబు ఖాతాలో పడేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇవే ఇప్పుడు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇకనైనా చంద్రబాబు భజన మానండంటూ ఎక్కువ మంది సూచిస్తున్నారు. మొత్తానికైతే ఏపీలో సెల్ ఫోన్లు ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు కాదంటూ ప్రజలకు తేలిసిపోయిందన్న మాట. మరి దీనిపై ఎల్లో మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.