Chevireddy Bhaskar Reddy Arrest : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంగళవారం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కొలంబో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను మంగళవారం అర్ధరాత్రి అధువులకు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మూడు ప్రత్యేకమైన వాహనాలలో కన్నడ రాజధాని నుంచి మంగళగిరి కి భాస్కర్ రెడ్డిని మంగళగిరి తీసుకువచ్చారు. అంతేకాదు భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్ పోర్ట్, ఇతర ఆధారాలను ఏపీ పోలీసులకు కన్నడ పోలీసులు అందించారు.. కాగా ఇటీవల ఏపీ పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.. ఆ నోటీసులు అలా ఉండగానే కర్ణాటక రాజధాని నుంచి శ్రీలంకలోని కొలంబో నగరానికి భాస్కర్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. బెంగళూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను పరిశీలించి.. అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీ పోలీసులకు సమాచారం అందించి.. ఆయనను వారికి అప్పగించారు. ఏపీ పోలీసులు ఆయనను మంగళగిరి తీసుకువచ్చారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా పాత్ర ఉందని సిట్ అధికారులు అభియోగాలు మోపారు. అంతేకాదు ఈ కుంభకోణంలో ఇప్పటివరకు 200 మందిని పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు ఏ -38 గా పేర్కొన్నారు. ఇక ఈ కుంభకోణం లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు వెంకటేష్ నాయుడు కూడా సిట్టి అధికారుల చేతిలో అరెస్టు అయ్యారు. ఆయనను సిట్ అధికారు ఏ -34 గా పేర్కొన్నారు.. వెంకటేష్ తో పాటు భాస్కర్ రెడ్డి పై లుక్ అవుట్ సర్క్యులర్లను సిట్ అధికారులు జారీ చేశారు. ఆ తర్వాత వీరిద్దరిని బెంగళూరు విమానాశ్రయ అధికారులు నిర్బంధించి.. ఆ తర్వాత ఆ సమాచారం ఏపీలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు వెల్లడించారు.. ఇక ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య భాస్కర్ రెడ్డి, వెంకటేష్ తో కలిసి 9కి చేరుకుంది. మరవైపు బుధవారం చెవిరెడ్డి, వెంకటేష్ ను విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల కార్యాలయానికి తీసుకొచ్చి.. ఆ తర్వాత ఏసిబి కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది.. బుధవారం వైయస్ జగన్ పల్నాడు పర్యటన ఉండగానే సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.. మరి బుధవారం నాడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సి ఉంది.