Chevireddy Bhaskar Reddy bail news: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో అయితే అప్పటి సిటింగ్ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. 2019లో రెండోసారి గెలిచి మంత్రి పదవిని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తుడా చైర్మన్ గా పదవి ఇచ్చారు. మంత్రి పదవికి మించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో స్వేచ్ఛ కల్పించారు. ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతల విన్నపాన్ని కాదని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. చివరి నిమిషంలో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సీటును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. వైసీపీ గెలిచి ఉంటే చెవిరెడ్డి కుటుంబ హవా మరింత పెరిగేది. కానీ ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో చెవిరెడ్డి కుటుంబానికి ఇబ్బందులు తప్పడం లేదు.
Also Read: తేల్చి చెప్పిన వైవి సుబ్బారెడ్డి.. అరెస్ట్ తరువాయి!
బెయిల్ పిటిషన్ కొట్టివేత..
మద్యం కుంభకోణం( liquor scam) కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. గత కొంతకాలంగా ఆయన జైల్లోనే గడుపుతున్నారు. ఈరోజు ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు బెయిల్ లభించలేదు. డిసెంబర్ 5 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో భాస్కర్ రెడ్డి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తనకు అసలు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని వాదనలు వినిపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ కోర్టు లో మాత్రం ఆ వాదనలు పనిచేయలేదు. నెలల తరబడి ఆయన రిమాండ్ కొనసాగుతూనే ఉంది.
Also Read: వైసిపి స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణ?!
పక్కా ఆధారాలతో
మద్యం కుంభకోణాన్ని విచారణ చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team). అందులో చెవిరెడ్డి పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఉండగా.. కుంభకోణం ద్వారా వసూలు చేసిన నగదు పంపకాలు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో కూడా చైర్మన్ గా ఉన్న భాస్కర్ రెడ్డి ఆ వాహనాలతోనే డబ్బుల పంపకాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులకు నగదు పంపిణీ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. పైగా విచారణలో భాగంగా చెవిరెడ్డి అనుచిత ప్రవర్తన సైతం ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇబ్బందిగా మారింది. అందుకే ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.