Chandrababu On Amit Shah: చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్రనేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి నుంచి ఆహ్వానం రావడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ రెండు పార్టీలు అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో వరుస భేటీ అవుతున్నారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై మంతనాలు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమిత్ షా కాలికి చంద్రబాబు దండం పెడుతున్నట్లు, మెట్రో రైలులో ప్రధాని మోదీ ఎదుట వంగి వంగి నిల్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగం పనేనని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. టిడిపి బిజెపికి దగ్గరవుతుండడాన్ని వైసీపీ శ్రేణులు సహించుకోలేకపోతున్నాయని.. అందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. అటు ఎల్లో మీడియాలో సైతం దీనిపై వివరణ ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదని ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నారు.
ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసిన ఫోటోలు అవని తేలుతోంది. 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు కొన్ని యోగాసనాలు వేశారు. ఆయన వంగి వంగి వేసిన ఆసనాల ఫోటోను అమిత్ షా ఎదుట పెట్టి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రధాని మోదీ ఎదుట వంగి నిల్చున్న ఫోటోను సైతం ఎడిట్ చేసి పెట్టారని ఆంధ్రజ్యోతి పతాక శీర్షికన.. వాస్తవం ఇది అంటూ పక్కపక్క ఫోటోలను పెట్టి.. ఫోటో ఫీచర్ మాదిరిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే వైసిపి సోషల్ మీడియా నుంచి మాత్రం ట్రోల్ ఆగడం లేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చేస్తుంది ఇది అంటూ తెగ ప్రచారం చేస్తుంది. వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతుండగా.. అది ఫేక్ ప్రచారం అంటూ టిడిపి కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఎన్నికల ముంగిట ఇటువంటి చిత్రవిచిత్రాలు మరెన్ని చూడాలో అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
This is not a #Way2News story. Some miscreants are spreading misinformation in #SocialMedia, using our logo, and the ‘attached post’ has gone viral. We confirm that this has not been published by @way2_news#Way2News #FactCheckByWay2News pic.twitter.com/Rm46iywft3
— Fact-check By Way2News (@way2newsfc) February 7, 2024