Free Gas Scheme : ఉచిత గ్యాస్ పథకం.. ఆ జిల్లానే సెంటిమెంట్ గా భావించిన బాబు!

ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలకు హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో హామీ నెరవేర్చుతున్నారు. తాజాగా ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టునున్నారు.

Written By: Dharma, Updated On : October 29, 2024 10:16 am

Free Gas Scheme

Follow us on

Free Gas Scheme : ఏపీలో ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. 29 నుంచి ఉచిత గ్యాస్ ను బుక్ చేసుకోవచ్చు. అదేరోజు గ్యాస్ కంపెనీలకు సీఎం చంద్రబాబు చెక్కులు అందించనున్నారు. తాము అధికారంలోకి వస్తేఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో సైతం ఉచిత గ్యాస్ కు చోటిచ్చారు. అధికారంలోకి రావడంతో ఇప్పుడు పథకానికి శ్రీకారం చుట్టునున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 850 రూపాయల వరకు ఉంది.ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఒక్కో లబ్ధిదారుకు 2500 రూపాయలు లబ్ధి చేకూరనుంది.అయితే పథకాన్ని ప్రజల మధ్య ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నవంబర్ 1న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు చంద్రబాబు.శ్రీకాకుళం జిల్లా సెంటిమెంట్ కావడంతో ఈ పథకానికి అక్కడే శ్రీకారం చుడతారు.

* టిడిపి హవా
తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ విజయం అందించింది శ్రీకాకుళం జిల్లా.ఉమ్మడి జిల్లాలో పదికి పది అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వంశధార, నాగావళి, బహుదా నదుల అనుసంధానం తో పాటు మూలపేట పోర్టు పూర్తి చేయడం, జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు, భారీ పరిశ్రమల ఏర్పాటు వంటి వాటికీ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక తొలిసారిగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వస్తుండడంతో.. తప్పకుండా వరాలు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

* పింఛన్ పథకం సక్సెస్
ఇప్పటికే కూటమి ప్రభుత్వం పింఛన్లను పెంచింది.వైసిపి ప్రభుత్వం 3000 రూపాయల పింఛన్ అందిస్తుండగా.. ఒకేసారి దానిని పెంచుతూ నాలుగు వేలు చేసింది కూటమి ప్రభుత్వం. బకాయిలతో సహా చెల్లింపులు చేసింది. అయితే పింఛన్ల తరువాత అతి పెద్ద పథకంగా ఉచిత గ్యాస్ నిలవనుంది. అందుకే ప్రజల మధ్య ఈ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు భావించారు. అందుకు శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం ఉంది. మరోవైపు పార్టీ పరంగా కూడాసభను విజయవంతం చేసేందుకు టిడిపి నేతలు శ్రమిస్తున్నారు.