Chandrababu skill development scam: ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) మంచి రోజులు నడుస్తున్నాయి. ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలియనిది కాదు. ఆయన అధికారంలోకి రావడం అసాధ్యం అనుకున్న రీతిలో.. సుసాధ్యం చేసి చూపించారు. కూటమి కట్టి తిరుగులేని విజయం సాధించారు. 164 అసెంబ్లీ సీట్లతో ఘనవిజయం పొందారు. దాదాపు ఏడాదిన్నర పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్టు చేశారో.. అప్పుడే ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. అయితే అప్పట్లో పెట్టిన కేసులు ఒక్కొక్కటి కూటమి వచ్చాక క్లోజ్ అవుతున్నాయి. అందులో ప్రధానమైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును కూడా ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. చంద్రబాబుతో సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
52 రోజులు రిమాండ్ ఖైదీగా..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ పేరిట భారీ కుంభకోణానికి తెర తీసారని అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. రూ.371 కోట్లు దుర్వినియోగం చేసినట్లు చూపింది. ఈ కేసుల్లో అప్పటి సీఎం చంద్రబాబును బాధ్యుడిని చేసింది. 2023 సెప్టెంబర్ 9న సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. 52 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. 2023 అక్టోబర్ 31న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు చంద్రబాబు. అటు తరువాత కూడా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని వైసిపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కానీ చివరకు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అప్పట్లో చంద్రబాబుకు పోరాట లభించింది..
ఒక్కో కేసు నుంచి విముక్తి..
అయితే అప్పట్లో చంద్రబాబుపై ఒక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు మాత్రమే కాదు. ఓ ఐదు కేసులను పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో కేసులో ఆయనకు విముక్తి లభిస్తూ వచ్చింది. అయితే స్కిల్ స్కామ్ కేసులో సిఐడి సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో తుది నివేదికలు దాఖలు చేసింది. అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలు వినాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో వాదనలు కూడా జరిగాయి. అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు అజయ్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. మిస్టేక్ ఆఫ్ షార్ట్ కారణంగా చూపుతూ నిందితులపై విచారణను మూసివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చంద్రబాబుతో సహా 37 మంది నిందితులకు ఆరోపణల నుంచి విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.