Chandrababu : అమిత్ షా ఆఫర్ ను తిరస్కరించిన చంద్రబాబు

Chandrababu : వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే అదంతా గతం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండేవారు చంద్రబాబు. ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు.

Written By: NARESH, Updated On : June 24, 2024 6:31 pm

Chandrababu rejected Amit Shah's offer

Follow us on

Chandrababu : చంద్రబాబు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఎదురైన పరాభవాలను గుర్తుచేసుకొని మసులుకుంటున్నారు. గత తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీని గాడిలో పెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం కానీ.. జాతీయ రాజకీయాలతో పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకూ కేంద్ర ప్రభుత్వంతో పని చేయించుకోవాలని మాత్రమే చూస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే అదంతా గతం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండేవారు చంద్రబాబు. ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. వారంలో రెండు రోజులు ఢిల్లీకి అంటూ అప్పట్లో చెప్పుకున్నారు కూడా. కానీ ప్రధాని మోదీ వ్యూహం ముందు చంద్రబాబు లక్ష్యం నెరవేరలేదు. ఆ తరువాత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆయన.. ఐదేళ్లపాటు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. భారీగా మూల్యం చెల్లించుకున్నారు. గుణపాఠాలు నేర్చుకున్నారు. నమ్మకస్తులైన మిత్రులు ఎవరు? పార్టీకి అసలేం అవసరం? పవర్ చేతిలో ఉన్నప్పుడు చక్కదిద్దాల్సిన అంశాలు ఏమిటి? వంటి వాటిపై ఫుల్ క్లారిటీ వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఎన్డీఏ మూడోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టిడిపి కీలకం. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కూడా ఇది సరైన సమయం. కానీ ఆ పనికి దూరంగా ఉన్నారు ఆయన. తన ఫోకస్, ప్రయారిటీ అంతా ఏపీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

అయితే అందరూ ఊహిస్తున్నట్టే చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు కేంద్ర పెద్దలు. లోక్ సభ స్పీకర్ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకుగాను కేంద్రమంత్రి అమిత్ షా నేరుగా చంద్రబాబు కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు వద్దని వారించినట్లు సమాచారం . ఇదే విషయాన్ని పార్టీ నేతలతో పంచుకున్నారు ఆయన. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అడగాలే కానీ.. నో చెప్పలేని స్థితిలో కేంద్ర పెద్దలు ఉన్నారు. అయినా సరే ఎటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయదలుచుకోలేదు చంద్రబాబు. వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక చేయూత పొందడానికి ఆయన తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా ఎటువంటి పదవులపై ఒత్తిడి చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చంద్రబాబు టిడిపి నేతలతో చెప్పుకొచ్చారు.