Chandrababu TTP Cadre: ఏడు పదుల వయసులో కూడా సీఎం చంద్రబాబు( CM Chandrababu) దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తన సీనియారిటీని రంగరించి మరి రాష్ట్ర ప్రయోజనాలకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నాలుగో సారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తనలో 95 సీఎం చూస్తారని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే.. గత మూడు పర్యాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వినూత్న రాజకీయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం.. పెట్టుబడులను ఆకర్షించడం.. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేసి విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం.. తన పనితీరుతో ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు.
Also Read: 100 అడుగుల దూరం నడవలేక బైక్ బుక్ చేసింది.. మన వ్యవస్థలో లోపాన్ని ఎండగట్టింది..
* క్యాడర్లో కూడా అదే..
అయితే రాష్ట్ర అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు సొంత పార్టీ వారిని, పార్టీ శ్రేణులను సంతృప్తి పరచలేక పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా ఈ విషయంలో టిడిపి సోషల్ మీడియాలో( TDP social media) సైతం ప్రచారం జరుగుతోంది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు పాత ధోరణిలో ఉన్నారని.. అది సరికాదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టిడిపి శ్రేణులను వేధించిన వారిపై కఠిన చర్యలకు దిగాలని సోషల్ మీడియా కోరుతోంది. కానీ ఈ విషయంలో దూకుడుగా వెళ్లలేమని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారించే ప్రయత్నం చేసింది టిడిపి నాయకత్వం. అయితే దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. కానీ తాము ఆశించిన స్థాయిలో జరగలేదని టిడిపి శ్రేణులతో పాటు సోషల్ మీడియా భావిస్తోంది.
*కేడర్ కంటే పాలనపై దృష్టి..
సాధారణంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కంటే పాలనకు ఎక్కువగా సమయం కేటాయిస్తారు. ఈ క్రమంలోనే పార్టీ అదుపు తప్పుతోంది. అధినేతతో పార్టీ శ్రేణులకు గ్యాప్ వస్తోంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. కార్యకర్తల కంటే అధికార యంత్రాంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా డ్యామేజ్ చేసి అంశం. గత 14 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వ పాలనకే ప్రాధాన్యం ఇచ్చారని.. పార్టీ కోసం కనీస సమయం కేటాయించడం లేదన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. అయితే 2019 నుంచి 2024 మధ్య విపక్షంలో ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో ఇకనుంచి పార్టీ శ్రేణులకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్న ఆ మాటలు అమలు కాలేదు.
* మనస్థాపంతో ఎమ్మెల్యేలు, మంత్రులు
మరోవైపు అధినేత చంద్రబాబు పట్ల ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరి మారుతోంది. తాను పూర్తిస్థాయిలో పనిచేస్తున్న కొంతమంది పనిచేయడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు వారికి మనస్థాపానికి గురిచేస్తున్నాయి. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పి4 వంటి కార్యక్రమాలు వికటిస్తాయని ఎక్కువ మంది అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. తరచూ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో సమావేశం అవుతానని.. వారి అభిప్రాయాలను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. కానీ అటువంటి సమావేశాల విషయంలో ఎటువంటి కదలిక లేదు. ఇక సారి తనలో పూర్తిస్థాయి రాజకీయ నేతను చూస్తారని చెప్పిన చంద్రబాబు.. ఆ పని చేయడం లేదన్న విమర్శ ఉంది. ఈ ప్రతికూలతలన్నీ సరి చేసుకోకపోతే ఇబ్బందికరమే. చంద్రబాబు పనితీరుపై ఎటువంటి అభ్యంతరాలు లేవుగాని.. అనుసరిస్తున్న వైఖరి పై మాత్రం పార్టీ శ్రేణులు కొద్దిపాటి అసంతృప్తితో ఉన్నాయి. వాటిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో?