https://oktelugu.com/

CM Chandrababu : కూటమి సరే.. ఆ ఒక్క ఎమ్మెల్యేను కంట్రోల్ చేయలేకపోతున్న చంద్రబాబు!

ఆ ఒక్క ఎమ్మెల్యే చంద్రబాబుకు తెగ చికాకు పెడుతున్నారు. ఏదో ఒక వివాదాన్ని పెడుతూనే ఉన్నారు. దీంతో ఆయన విషయంలో ఏం చేయాలో చంద్రబాబుకు పాలు పోవడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 19, 2024 / 01:17 PM IST

    Chandrababu- Kolikapudi Srinivas Rao

    Follow us on

    CM Chandrababu :  ఈ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సొంతం చేసుకుంది. 164 సీట్లలో గెలుపొందింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తెలుగుదేశం పార్టీకి కనివిని ఎరుగని విజయం సొంతమైంది. ప్రజలు ఎంతో నమ్మకంతోకూటమిని గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగిద్దామని చంద్రబాబుతో పాటు పవన్ ఎమ్మెల్యేలను కోరారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. అయితే టిడిపి నుంచి గెలిచిన 134 మందిలో ఒక ఎమ్మెల్యే తీరు మాత్రం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. నా రూటు సెపరేట్ అంటూ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. ఆయనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఆయన తీరును సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాలు పోవడం లేదు. ఇలానే వదిలేస్తే ఆయన రెబల్ గా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    * అమరావతి ఉద్యమ నేపథ్యం
    అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి. గత ఐదేళ్ల వైసిపి పాలనలోఅమరావతి రాజధాని అంశం గట్టిగానే పోరాడారు కొలికపూడి. నేరుగా ఉద్యమించడంతో పాటు టీవీ డిబేట్లో సైతం తన వాయిస్ వినిపించారు. ఓ టీవీ డిబేట్లో అయితే బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు కూడా. అమరావతి ఉద్యమంతో పాటు చంద్రబాబును కీర్తించడంలో కొలికపూడి ముందుండేవారు. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నడుమ ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలిచారు. గెలిచింది మొదలు వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేసిన అత్యుత్సాహం పార్టీకి సమస్యగా మారుతుంది. అన్నీ తానే చేయాలనుకునే ఆలోచన శైలి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.అధికారులు చేయాల్సిన పని కూడా తానే చేస్తానని బొట్టు పడడంతో విమర్శలకు కారణమవుతోంది. వివాదాలకు దారితీస్తోంది.

    * డిఫెన్స్ లో సొంత పార్టీ
    కొలికపూడి మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. అయితే ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆయన చేస్తున్న హడావిడితో సొంత పార్టీ శ్రేణులు కూడా దూరం అవుతున్నాయి. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అనే పరిస్థితి వస్తోంది. పేకాట శిబిరాల నిర్వహణపై కొలికపూడిదూషణలతో ఒక ప్రజా ప్రతినిధి సతీమణి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ అంశం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. అక్కడ నుంచి వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు శ్రీనివాసరావు. సీఎం చంద్రబాబు పిలిపించి మందలించారు. దూకుడు తగ్గించుకోవాలని సూచించారు. కానీ ఎమ్మెల్యే కొలికపూడి తీరులో మాత్రం మార్పు రాలేదు. తాజాగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అంటూ కొన్ని మద్యం దుకాణాలకు తాళాలు వేయించారు. ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తేసహించేది లేదని హెచ్చరించారు. అయితే బెల్టు షాపుల నియంత్రణ సరైనదే అయినా.. అందరి సమక్షంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీని నష్టపెడుతోంది. దీనిపైనే పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నాయి. మరి నాయకత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతుందో చూడాలి.