Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Delhi Visit: ఢిల్లీకి నేడు బాబు.. గుడ్ న్యూస్ తో తిరిగి..!

Chandrababu Delhi Visit: ఢిల్లీకి నేడు బాబు.. గుడ్ న్యూస్ తో తిరిగి..!

Chandrababu Delhi Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి టిడిపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సైతం ఆయన హాజరవుతారు. గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతుండడం విశేషం.
* సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రాష్ట్రపతి భవన్ లో గురువారం ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
* సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.
* కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చిస్తారని తెలుస్తోంది.
* లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి ఏపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై కూడా చర్చించే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గుడ్ న్యూస్ తో వస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version