Chandrababu: ఇటీవల కుర్చీ మడతపెట్టి డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్ గా మారింది. దీంతో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టే పాటను సైతం పెట్టడం విశేషం. అయితే ఈ పాట దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఏకంగా కొందరు సెలబ్రిటీలే డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో అలరించారు. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో సైతం ఈ మాట వినిపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మడత పెట్టే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘
ఓ సీనియర్ జర్నలిస్టు రాసిన విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జర్నలిస్టు ధర్మాగ్రహం, దేశ చరిత్రలో తొలిసారి పాలనపై పుస్తకం రావడం దురదృష్టకరమన్నారు. ఇది అమరావతి రైతు మహిళలకు అంకితం చేయడం గర్వంగా ఉందన్నారు. ఐదేళ్లలో మూడు రాజధానులు.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. విధ్వంసకర ఘటనతో పాలనను ప్రారంభించారని.. తాను నివాసం ఉంటున్న ఇల్లును సైతం ఖాళీ చేయించే ప్రయత్నం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
మరో 54 రోజుల్లో ఏపీలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మా బాధ్యత మేము నెరవేరుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.’ చొక్కా మడత పెడతాడట… మీరు చొక్కాలు మడత పెడితే
.. మా టిడిపి, జనసైనికులు కుర్చీలు మడత పెడతారని’ చంద్రబాబు కామెంట్ చేశారు. ఇదే సభలో జనసేన అధినేత పవన్ తో పాటు వామపక్షాల నేతలు కూడా ఉన్నారు. చంద్రబాబు హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.