Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: వాలంటీర్లపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు

Chandrababu: వాలంటీర్లపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు

Chandrababu: ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. వాలంటీర్లతో అదనపు ఖర్చు అని.. భర్తీ చేయడం దండగ అని ఒక రకమైన అభిప్రాయం వినిపిస్తుండగా.. తప్పకుండా నియమించాల్సిన అవసరం ఉందని మరో రకమైన డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది వరకు వలంటీర్లు రాజీనామా చేశారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వద్దని వారించినా వినలేదు. రాజీనామా చేయని వారిని కొనసాగిస్తామని. వారందరికీ వేతనాలు 10000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దీంతోదాదాపు లక్ష మంది వరకు రాజీనామా చేయలేదు.వారందరికీ కొనసాగింపు లభిస్తుందని ఆశించారు.అయితే చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు.

వాలంటీర్ల కొనసాగింపు పై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు.అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది, టిడిపి నేతలు దగ్గరుండి మరి పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు. ఈరోజు సాయంత్రానికి శత శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాజధాని ప్రాంతం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియను ప్రారంభించారు చంద్రబాబు.అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో.. ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ 33 మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

అప్పట్లో సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని తాము కోరినా.. వారు అలా చేయలేదన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చి సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేసి చూపించమన్నారు. సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పామన్నారు. అయితే చంద్రబాబు నోటి నుంచి వాలంటీర్ల మాట వచ్చేసరికి వారిలో ఆశలు చిగురించాయి. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని వారు నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular