Chandrababu: ఆ న్యూస్ చానెళ్లకు తొలిసారి భయపడుతున్న చంద్రబాబు.. అసలు కారణం ఇదే?

Chandrababu: 40 ఇయర్స్ పాలిటిక్స్.. మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన మన చంద్రబాబు సార్.. ఇప్పుడు అదే మీడియాకు భయపడడమా? ఎంత నామోషీ.. అయినా కాలం పెట్టిన పరీక్షలో ఫాఫం జగన్ ముప్పేట దాడికి కన్నీళ్లు పెట్టుకొని కరిగిపోయిన చంద్రబాబుకు మీడియాను చూసి భయపడేంత పరిస్థితి వచ్చిందంటే అయ్యో పాపం అనకమానరు.. ఎన్టీఆర్ హయాం నుంచి మీడియాను గుప్పిట పట్టి ప్రభుత్వాలనే మార్చేసేలా మేనేజ్ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రత్యర్థుల మీడియా మేనేజ్ మెంట్ […]

Written By: NARESH, Updated On : January 5, 2022 1:41 pm

Chandrababu

Follow us on

Chandrababu: 40 ఇయర్స్ పాలిటిక్స్.. మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన మన చంద్రబాబు సార్.. ఇప్పుడు అదే మీడియాకు భయపడడమా? ఎంత నామోషీ.. అయినా కాలం పెట్టిన పరీక్షలో ఫాఫం జగన్ ముప్పేట దాడికి కన్నీళ్లు పెట్టుకొని కరిగిపోయిన చంద్రబాబుకు మీడియాను చూసి భయపడేంత పరిస్థితి వచ్చిందంటే అయ్యో పాపం అనకమానరు.. ఎన్టీఆర్ హయాం నుంచి మీడియాను గుప్పిట పట్టి ప్రభుత్వాలనే మార్చేసేలా మేనేజ్ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రత్యర్థుల మీడియా మేనేజ్ మెంట్ ధాటికి ఏకంగా వణికిపోతున్న దుస్థితి కనిపిస్తోంది.

Chandrababu

చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మీడియాకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. మీడియాకు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మీడియా మేనేజ్ మెంట్స్ మారుతుండటంతో గతంలో ఆయన పెంచిపోషించిన మీడియా సంస్థలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే టీడీపీ వ్యతిరేక వార్తలిచ్చే మీడియాకు దూరంగా ఉండాలని చంద్రబాబు తమ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.

ఇందులో భాగంగానే సాక్షి, ఐ డ్రీమ్, టీవీ-9, ప్రైమ్-9 ఛానెళ్లను టీడీపీ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఏపీలోని పార్టీ ముఖ్యనేతలకు ఓ కబురు వెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులెవరూ కూడా పైన పేర్కొన్న మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూ ఇవ్వద్దని అల్టిమేటం జారీ చేశారట. సదరు ఛానెళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా అకృత్యాలను ఆయన చూశారు. చంద్రబాబు నాయుడి అధికారంలో ఉన్నప్పుడు పల్లకి మోసిన పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి మాత్రం టార్గెట్ చేశాయి. రాజకీయ విమర్శలతోపాటు మానసికంగా దెబ్బతీసేలా మీడియా కథనాలను ప్రసారం చేశాయి. ప్రస్తుతం మీడియా విసృతి పెరగడంతో టీడీపీ అనుకూల మీడియాకు పోటీగా ఇతర ఛానళ్లు ఇబ్బడిముబ్బడిగా పుట్టికొస్తున్నాయి. అలాగే మీడియా మేనేజ్మెంట్ పాలసీలు తరుచూ మారుతూ వస్తుండటం చంద్రబాబుకు మైనస్ గా మారుతోంది.

ఈక్రమంలోనే ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీని అధికార పార్టీకి అండగా ఉండే ఛానళ్లు టార్గెట్ చేస్తున్నాయి. గతంలో జగన్ ఎలాగైతే మీడియా దాడిని ఎదుర్కొన్నారో ఇప్పుడు చంద్రబాబు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడినా దానికి విపరీర్థాలు తీసి కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు సైతం జగన్ మాదిరిగానే కొన్ని మీడియా ఛానళ్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ప్రకటించారు. దీంతో ఇకపై ఆ ఛానళ్లలో టీడీపీ నేతలు పాల్గొనే అవకాశం లేకుండా పోనుంది.

అయితే ఈ ఛానళ్లకు టీడీపీ నేతలు వెళ్లకపోవడం వల్ల ఆపార్టీకి ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరి పక్షం మాత్రమే మనలోని లోటుపాట్లను ఎత్తిచూపుతుందని వాటిని సరిచేసుకుంటే టీడీపీకే మంచిదనే వాదనలు విన్పిస్తున్నాయి. అలాకాకుండా టీడీపీ అనుకూల మీడియాలోనే చర్చలకు వెళితే అంతా మంచిగానే కన్పిస్తుంది. దీని వల్ల సంకలు గుద్దులుకోవడం తప్పించి ఎలాంటి ఉపయోగం ఉండదు.

గత ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు గ్రౌండ్ రిపోర్టు తెలుసుకోకుండానే వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం అంటూ బాబు ముందు బాకాలూదారు. చివరి ఆ ఎన్నికల్లో టీడీపీ బోక్కా బొర్లాపడటంతో చంద్రబాబుకు అసలు విషయం బోదపడింది. ఇప్పటికైనా చంద్రబాబు దీనిని గుర్తేరిగి వైరి పక్షం ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తేనే భవిష్యత్ ఉంటుందని లేదంటే మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.