Chandrababu – Pawan Kalyan : సీఎం పోస్ట్ : పవన్ కు వెన్నుపోటు.. కుట్రకు తెరతీసిన చంద్రబాబు

పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకునే చాన్సే లేదని.. చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమంటూ టీడీపీ నేత ఒకరు టీవీ డిబేట్లలో తొడగొట్టేశాడు.

Written By: NARESH, Updated On : May 4, 2023 12:19 pm
Follow us on

Chandrababu – Pawan Kalyan : చంద్రబాబును నమ్ముకుంటే.. నువ్వు ఉన్నది అమ్ముకోవాల్సిందే’ ఇది రాజకీయవర్గాల్లో ఓ ఫేమస్ సామెత. ఎందుకంటే ఆయనను నమ్మిన ఎన్టీఆర్ సీఎం కుర్చీ కోల్పోయాడు. 2009లో మహాకూటమి పెట్టి కేసీఆర్, కమ్యూనిస్టులను తనతోపాటు ఓడించాడు. 2018లో తెలంగాణ కాంగ్రెస్ తో జట్టుకట్టి బాబు ఓడించాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ పంచన చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిపోయేలా చేశాడు. చంద్రబాబుతో పెట్టుకుంటే నాశనం అని అందరు రాజకీయ నేతలకు తెలుసు.. పాపం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే తెలియదు. ఈసారి బాబు మాయలో పడి సర్వం కోల్పోయేందుకు రెడీ అయ్యారన్న చర్చ సాగుతోంది.

2024 ఎన్నికల కోసం పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు వెంట పడుతున్నాడు మన పవన్ కళ్యాణ్. ఇటీవలే ఓసారి వెళ్లి కలిశాడు. సీట్ల సంఖ్య తేల్చమన్నాడు. రెండున్నరేళ్లు సీఎం కుర్చీ షేరింగ్ చేసుకుందామని పవన్ డిమాండ్ పెట్టాడు. దానికి ఏమీ చప్పుడు చేయని చంద్రబాబు ఇప్పుడు తన అనుంగ టీడీపీ నేతలతో మీడియా ఎదుట .. టీవీ డిబేట్లలో అసలు పవన్ కు అంత సీను లేదని.. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కు సీఎం కుర్చీ ఇచ్చుడు ఏంది అని ఎద్దేవా చేసేలా మాటలు మాట్లాడిస్తున్నారు. చంద్రబాబే సీఎంగా ఉండాలని డిమాండ్ మొదలుపెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకునే చాన్సే లేదని.. చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమంటూ టీడీపీ నేత ఒకరు టీవీ డిబేట్లలో తొడగొట్టేశాడు. అవసరమైతే టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధంగా ఉందని మీకు చేతనైతే సొంతంగా పోటీచేయాలంటూ జనసేనకు సవాల్ చేశారు. వెనుకుండి చంద్రబాబు ప్రోత్సహించాడో లేక.. ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్ర సాగుతుందో కానీ పవన్ కు అంత సీన్ లేదని.. అతడికి సీఎం పోస్ట్ వేస్ట్ అని.. చంద్రబాబే సీఎం కావాలని టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారు..

దీంతో చంద్రబాబు ముందు పొత్తు కోసం పవన్ కాళ్ల మీద పడడం.. వెనుకాల పవన్ కు అంతసీన్ లేదు.. మేం ఒప్పుకోం అని టీడీపీ నేతల చేత చెప్పించడం చూస్తుంటే ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ లా అనిపిస్తోంది. పవన్ ను సీఎం కాకుండా.. ఆయనకు అంత బలం లేదన్నట్టుగా పచ్చమీడియా, చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును నమ్ముకుంటే ఇలానే కుట్రలు కుతంత్రాలతో మరో ఎన్టీఆర్ లా పవన్ ను చేస్తారని సెటైర్లు వేస్తున్నారు.