Chandrababu: తనపై పాజిటివ్ కంటే.. వారిపై నెగిటివ్ ను కోరుతున్న చంద్రబాబు

మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే రేవంత్ రెడ్డి కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. కేవలం కెసిఆర్ సర్కార్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

Written By: Dharma, Updated On : January 20, 2024 11:08 am

Chandrababu

Follow us on

Chandrababu: ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. అధికార వైసిపి దూకుడు మీద ఉంది. తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన పరాభవాన్ని.. గుణపాఠం గా తీసుకుని జగన్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను ప్రకటించి 60 మందిని మార్పు చేశారు. మరో 20 మంది వరకు మార్చుతారని ప్రచారం జరుగుతోంది. కేవలం తెలంగాణలో సిట్టింగులపై వ్యతిరేకతతోనే కెసిఆర్ ఓడిపోయారని గ్రహించి జగన్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే రేవంత్ రెడ్డి కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. కేవలం కెసిఆర్ సర్కార్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని సైతం ప్రస్తావించారు. వీటికి సంబంధించి వీడియోలను విడుదల చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేయాలని భావిస్తున్నారు. జగన్ సర్కార్ పై నెగిటివ్ వచ్చేలా వీడియోలను రూపొందించి విడుదల చేసేందుకు టిడిపి కసరత్తు చేస్తోంది. పూర్తిగా డిజిటల్ ప్రచారానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అనుకూల మీడియా ద్వారా జగన్ సర్కార్ పై వ్యతిరేకతను పెంచేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో సందేశాత్మక వీడియోలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

చంద్రబాబు పాజిటివ్ పబ్లిసిటీ కంటే.. వైసిపి పై నెగిటివ్ పబ్లిసిటీ పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి తరచూ కారుకు పంచర్ అయిందని.. వారు రిపేరుకు వచ్చిందని, ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ కు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని అనేక వీడియోలను చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈ ప్రయత్నంతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు వైసీపీకి సంబంధించి నెగిటివ్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని నిర్ణయించారు. పూర్తిగా ఈ ఐదేళ్లలో వైసిపి పాలన వైఫల్యాలను ప్రజల ముందు ఆవిష్కరించాలని డిసైడ్ కావడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.