Chandrababu: పెద్దిరెడ్డికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు భారీ స్కెచ్!

2004లో అధికారంలోకి వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా 2006లో పడమటి మండలాలకు సాగునీరు అందించేందుకు హంద్రీ నీవా పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ ఆయన అకాల మరణంతో పనుల్లో జాప్యం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సైతం 2013 నాటికి ఈ పథకం పూర్తి చేయాలని భావించారు. కానీ పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ పథకం పూర్తి చేయాలన్న సంకల్పంలో చంద్రబాబు ఉన్నారు.

Written By: Dharma, Updated On : July 10, 2024 10:46 am

Chandrababu

Follow us on

Chandrababu: వైసిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఎక్కువగా ఇబ్బంది పెట్టింది సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని గట్టిగానే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కంటే కుప్పం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఎలాగైనా చంద్రబాబును ఓడించి తీరుతానని శపథం చేశారు. కానీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించడంతో పాటు టిడిపి సైతం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు పెద్దిరెడ్డి పై దృష్టి పెట్టారు.

మొన్న ఆ మధ్యన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు పుంగనూరులో పార్టీ సమావేశానికి మిధున్ రెడ్డి సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒక్క రాజకీయంగానే కాకుండా.. ఇతరత్రా మార్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. పుంగనూరుకు హంద్రీ నీవా నీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తద్వారా సుదీర్ఘకాలం పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి చేయలేని పని.. తాను చేసి చూపించాలి అనుకుంటున్నారు. తద్వారా ప్రజల్లో పెద్దిరెడ్డిని పలుచన చేయాలని భావిస్తున్నారు.

2004లో అధికారంలోకి వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా 2006లో పడమటి మండలాలకు సాగునీరు అందించేందుకు హంద్రీ నీవా పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ ఆయన అకాల మరణంతో పనుల్లో జాప్యం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సైతం 2013 నాటికి ఈ పథకం పూర్తి చేయాలని భావించారు. కానీ పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ పథకం పూర్తి చేయాలన్న సంకల్పంలో చంద్రబాబు ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకం పనులు పూర్తి చేయించి కుప్పం వరకు నీళ్లు పారించారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలకు నీళ్లు అందించడానికి పుంగనూరు బ్రాంచ్ కాల్వ కీలకం. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ సమీపంలో బొంతలపల్లి దగ్గర ఈ కాల్వ ప్రారంభమవుతుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ కాల్వను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో పూడిక పేరుకుపోయింది. పలుచోట్ల కట్టలు సైతం బలహీనమయ్యాయి. ఇటీవల కుప్పం వచ్చిన చంద్రబాబుకు అధికారులు ఇదే విషయాన్ని నివేదించారు. దీంతో ఈ కాలువను పుంగనూరు వరకు విస్తరించి హంద్రీనీవా నీటిని అందించాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా పెద్దిరెడ్డిని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.