Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కంట తడి పెట్టిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులపై వైసీపీ చేసిన విమర్శలకు తట్టుకోలేక ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అటు నందమూరి ఇటు చంద్రబాబు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో చంద్రబాబు ఇక తాను శాసనసభలో అడుగుపెట్టనని చెప్పి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంలో చంద్రబాబుకు సానుభూతి బాగానే వచ్చింది.

కానీ ఇక్కడో మరో ట్విస్ట్ ఏర్పడింది. బాబు సభకు రానని తెగేసి చెప్పినా ప్రస్తుత పరిణామాలు ఆయన మళ్లీ రావడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. మూడు రాజధానుల రద్దు విషయం తాత్కాలికమేనని బలమైన మార్పులతో మరోసారి బిల్లు తీసుకువస్తామని జగన్ ప్రకటించడంతో దాన్ని అడ్డుకునేందుకైనా బాబు మళ్లీ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ బాబును మరోసారి సభక రప్పించేందుకు పరోక్షంగా సాయపడుతున్నట్లు తెలుస్తోంది.
వికేంద్రీకరణ బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో చట్టం చేసేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ విధానాలను అడ్డుకునేందుకైనా బాబు సభకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఆయన సభలో అడుగుపెట్టనని శపథం చేసిన క్రమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా? లేక ప్రజా సమస్యల దృష్ట్యా మళ్లీ సభలోకి వస్తారా అనే దానిపై అనుమానాలున్నాయి.
Also Read: Visakha Capital Issue: విశాఖ రాజధాని ఫైట్: జగన్ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో ఉద్యమం షురూ..
అమరావతి రాజధాని కోసమే బాబు పోరాటం చేస్తున్న క్రమంలో జగన్ వేరే రాజధాని ప్రస్తావన తెస్తే చంద్రబాబు ఖచ్చితంగా సభలో ఉండాల్సిన అవసరం ఏర్పడుతున్నందున చంద్రబాబు మనసు మార్చుకుంటారా? లేక నాకెందుకులే అనుకుంటారా అనే ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. అందుకే చంద్రబాబు సభలో అడుగు పెట్టడంపై పునరాలోచించుకుంటారనే వాదన బలంగా వినిపిస్తోంది.
Also Read: Tollywood Stars: వరదలకు స్పందించని స్టార్స్.. సీఎం జగన్ పై కోపమే కారణమా?