Chandrababu on Kuppam: చంద్రబాబు( AP CM Chandrababu) రాజకీయ ప్రత్యర్థులు ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనే ఓడించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. వై నాట్ కుప్పం అన్న నినాదంతో గట్టి ప్రయత్నమే చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన పుంగనూరును విడిచిపెట్టి కుప్పం పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకున్న చంద్రబాబు కుప్పం ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గతానికంటే భిన్నంగా ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నది స్థానికుల మాట. అయితే రాష్ట్ర పాలకుడుగా చంద్రబాబు బిజీ కావడం ఒక కారణం అయితే.. విపక్షంలోకి వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంపై వివక్ష కూడా కొనసాగింది. అందుకే ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రబాబు కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
కేంద్ర నిధులతో సైతం..
ప్రస్తుతం కుప్పంలో( Kuppam ) పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. అంతలా పరోక్షంగా దృష్టి పెట్టారు చంద్రబాబు. ఎంతటి బిజీలో ఉన్నా కుప్పం పై ఒక కన్నేసి ఉంచారు. ఆపై చంద్రబాబు సతీమణి సైతం నిత్యం నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. కేవలం రాజకీయంగా ప్రతికూలతలు వస్తున్నందునే కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు అన్నది బహిరంగ రహస్యం. మరోవైపు నాలుగు దశాబ్దాలుగా తనకు అండగా నిలుస్తున్న నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని కూడా చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. కుప్పంకు అది చేసాం ఇది చేసాం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కూడా తానే చేసామని చెప్పింది. ఇవన్నీ రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకుంది. మరోసారి వైసీపీ లాంటి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని భావించిన చంద్రబాబు కుప్పం పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఐదు మండలాల్లో అభివృద్ధి..
నియోజకవర్గంలో ఐదు మండలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. అక్కడ ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నిరంతరం సమీక్షిస్తున్నారు కూడా. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు సైతం అందిస్తున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సైతం పూర్తయింది. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తన నియోజకవర్గంలో p 4 ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇవన్నీ సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. అయితే కేవలం అభివృద్ధి కాదు ప్రజల జీవనస్థితిని మార్చాలని కూడా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు.
నారా భువనేశ్వరి ఫోకస్..
మొన్న ఆ మధ్యన కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల పాటు కుప్పంలో రాజకీయం చేసిన చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆ ఇంట్లో అడుగు పెట్టారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి సేవలందిస్తున్నారు. నిత్యం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. మొత్తానికి అయితే గత అనుభవాల దృష్ట్యా ముందే జాగ్రత్త పడినట్టు ఉన్నారు చంద్రబాబు.