CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) రాజకీయాల్లో చాలా హుందాతనం ప్రదర్శిస్తారు. ఆయన రాజకీయాన్ని రాజకీయంలాగే చూస్తారు. ఇది చాలా సందర్భాల్లో చూశాం కూడా. అయితే చంద్రబాబు ఎదుర్కొన్న రాజకీయ ప్రతికూలత మరో నాయకుడు ఎదుర్కోలేదు. 1995లో ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అది కూడా నందమూరి కుటుంబ సభ్యులంతా ముక్తకంఠంతో కోరితేనే. అటు తరువాత తన సొంత ఇమేజ్ తో రాణించగలిగారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగారు. అయితే తదనంతర పరిణామాలతో నందమూరి కుటుంబ సభ్యులు చాలాసార్లు చంద్రబాబును వ్యతిరేకించారు. అదే వ్యక్తులు మళ్లీ చంద్రబాబు వద్దకు చేరారు. అయితే ఇక్కడే ఒకటి తెలుసుకోవాలి. చంద్రబాబును విభేదించి చాలా రకాల వ్యాఖ్యలు చేసిన హరికృష్ణ మళ్లీ చేరదీశారు. చంద్రబాబును వ్యతిరేకించి బయటకు వెళ్లిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలు సైతం చంద్రబాబు మనసును అర్థం చేసుకుని మళ్లీ ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు.
* వ్యతిరేకించిన వారు సైతం..
ఆది నుంచి నందమూరి కుటుంబంతో( Nandamuri family) సఖ్యతగా మెలిగిన వారు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. చంద్రబాబు ఎంట్రీ తర్వాత అటువంటి నాయకుల ప్రాధాన్యతా అంశాలు మారాయి. అయితే చంద్రబాబును వ్యతిరేకించిన వారు నందమూరి కుటుంబ సభ్యులతో అదే పని చేయించాలనుకున్నారు. కానీ చంద్రబాబు ఎన్నడూ ఆ విషయంలో ఫెయిల్ కాలేదు. తొలినాళ్లలో అయితే ఎన్టీఆర్కు మద్దతుగా చాలామంది ఉండిపోయారు. 1995 టిడిపి సంక్షోభ సమయంలో సైతం ఎన్టీఆర్కు అండగా ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దుకృష్ణమనాయుడు. కార్యక్రమం లో ఆ ఇద్దరు నేతలు సైతం చంద్రబాబుకు జై కొట్టక తప్పలేదు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయక తప్పలేదు.
* అనంతపురం సభలో అంతంత మాత్రమే..
అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) విషయంలో చంద్రబాబు ఒక ప్రత్యేక ధోరణితో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెనుక చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారన్నది ప్రత్యర్థులు చేసే ఆరోపణ. అయితే జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులుగా ముద్రపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలియంది కాదు. చివరకు చంద్రబాబు సతీమణి పై కూడా వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కూడా వారిద్దరి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని ప్రచారం చేశారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. అర్జెంటుగా ఇప్పుడు చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ విభేదించాలి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు తప్పుగా వ్యవహరిస్తున్నారని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. కానీ అప్పుడు, ఇప్పుడు చంద్రబాబు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. క్రమశిక్షణతో పాటు సంయమనం పాటిస్తారు. అనంతపురంలో రెండు రోజుల కిందట కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఆ సభ అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోనిది. కానీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు సరైన ప్రాధాన్యత దక్కలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లి పై వ్యాఖ్యలు చేసినందుకుగాను చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అందుకే స్థానిక ఎమ్మెల్యేగా.. ప్రోటోకాల్ పరంగా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చిన మరుక్షణం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతి చేస్తుందని తెలుసు. అందుకే ఆ ఎమ్మెల్యేను దూరం పెట్టారు చంద్రబాబు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూసారే కానీ.. ఆయనకు అంత స్వేచ్ఛ ఇవ్వలేదు. అయితే అప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సదరు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఉన్న ఫోటోను పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కెలికింది. అయితే చంద్రబాబు ముందుచూపుతో సదరు ఎమ్మెల్యేను దూరం పెట్టడాన్ని ఇప్పుడు టిడిపి శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు ఆది నుంచి అంతే. ఆయనను ద్వేషించిన వారు సైతం దగ్గరయ్యారు. దానిని బట్టి తెలియజేస్తుంది ఆయన వ్యక్తిత్వం.