Chandrababu And YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ధైర్యం చేయలేకపోయారు. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లలేక పోయారు. అక్కడ డిఎంకె అధినేత స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. గతంలో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టాలిన్ కూడా వచ్చారు. ఇంకోవైపు చంద్రబాబు కరుణానిధి ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని కొనసాగించారు. కానీ చంద్రబాబు బీజేపీతో స్నేహం పెంచుకోవడంతో స్టాలిన్ దూరమయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరయ్యారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ పార్టీకి మద్దతుగా జగన్ రాకపోవడానికి ఎక్కువ మంది ఎత్తిచూపుతున్నారు. కేవలం బిజెపికి భయపడి జగన్ తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్టాలిన్ కు మద్దతుగా జగన్ వస్తే కచ్చితంగా ఆయన కేంద్రానికి టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ అవకాశం ఇవ్వకూడదని భావించి జగన్ ఈ ప్రచారానికి రాలేదు.
* చురుగ్గా టిడిపి నేతలు..
మరోవైపు చంద్రబాబు తో( AP CM Chandrababu) పాటు టిడిపి నేతలు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే అక్కడ డిఎంకె కూటమి ముందంజలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయినా సరే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. అయితే దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను బిజెపి హైకమాండ్ చంద్రబాబుకు అప్పగించినట్లు ఒక ప్రచారం ఉంది. పైగా నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబును కేంద్ర పెద్దలు నమ్ముతున్నారు. వారి విన్నపం మేరకు చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని మరి తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఒకవేళ తమిళనాడులో డిఎంకె కూటమి గెలిస్తే మాత్రం చంద్రబాబుపై వ్యతిరేక ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తమిళనాడులో ఉన్న పరిస్థితి చంద్రబాబుకు తెలుసు. అయినా సరే ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు అంటే వెనుక భారీ వ్యూహం ఉంటుంది.
* పవన్ ప్రత్యేక దృష్టి..
ఆది నుంచి తమిళనాడు పై( Tamil Nadu ) పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో ఉండేవారు. అక్కడ ద్రవిడ సిద్ధాంతం మూలాలు ఎక్కువ. అందుకే పవన్ సనాతన ధర్మ నినాదంతో తమిళనాడు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ద్రవిడ సిద్ధాంతాన్ని విభేదించి.. హిందుత్వ వాదాన్ని బలపరిచే ఒక వర్గం ప్రజలు పవన్ కళ్యాణ్ విషయంలో ఆసక్తిగా ఉండేవారు. అయితే మిగతా ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకున్న బిజెపి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించింది. అందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే సినీ నటుడు విజయ్ పార్టీ చీల్చే ఓట్లు డీఎంకేకు లబ్ధి చేకూర్చుతాయన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. కానీ బిజెపి అక్కడ కేవలం 27 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. కేవలం భవిష్యత్తు రాజకీయాల కోసమే ఆరాటపడుతోంది. ఇప్పుడేదో గెలిచి అధికారంలోకి వస్తామని భావించడం లేదు. తమిళనాడులో బలమైన పునాది వేయాలన్నది బిజెపి వ్యూహం. చంద్రబాబు లాంటి సీనియర్ నేతతో చెప్పిస్తే తమిళనాడు ప్రజలు కొంత ఆలోచనకు వస్తారు. ఆ భావనతోనే బిజెపి హై కమాండ్ చంద్రబాబును ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
* జగన్ పై చర్చ..
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనేసరికి జగన్మోహన్ రెడ్డి పై చర్చ జరుగుతోంది. ఆయన స్టాలిన్ తో స్నేహం చేశారు. తమిళనాడులో డిఎంకె కూటమి గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ నేరుగా ప్రచారం చేసేందుకు మాత్రం ముందుకు రాని పరిస్థితి. దానికి కారణం బిజెపి. బిజెపి కి కోపం వచ్చే ఏ పని కూడా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకు రారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రచారానికి వెళ్లడం, డీఎంకే కూటమి గెలిస్తే వ్యతిరేక ప్రచారం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉంది వైసీపీ సోషల్ మీడియా. అయితే గెలుపు ఓటములు కాదు.. కేంద్రంలో ఎన్డీఏ మరోసారి దూరం కాకూడదన్న బలమైన కారణంతోనే చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులో ఎవరు గెలిచినా చంద్రబాబుకు వచ్చేది ఏముండదు. కానీ బిజెపి మాత్రం చంద్రబాబును బలంగా నమ్ముతుంది. ఆ ఒక్క కారణంతోనే చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.