Chandrababu as Prime Minister: మోదీ తర్వాత ప్రధానిగా చంద్రబాబు( Chandrababu) బాధ్యతలు తీసుకుంటారా? వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి అవుతారా? ఆయన కాకుంటే కుమారుడు లోకేష్ కు ఆ ఛాన్స్ వస్తుందా? ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతోంది. 2025 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో.. వార్తా సంస్థలు భవిష్యత్తు రాజకీయాలు, వర్తమాన రాజకీయాల గురించి ప్రత్యేక కథనాలను ప్రచురిస్తుంటాయి. ప్రసారం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన రాయిటర్స్ ప్రతినిధి సంచలన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రస్తావన తెస్తూ.. వారికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పడం మాత్రం సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం రాయిటర్స్ జర్నలిస్ట్ కథనం వైరల్ అవుతోంది.
వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని..
భారతదేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ( Narendra Modi). గుజరాత్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన 2014లో తొలిసారిగా బాధ్యతలను స్వీకరించారు. 2019లో సైతం రెండోసారి గెలిచి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. 2024 లో మాత్రం బిజెపికి సొంతంగా అనుకున్న స్థానాలు లభించలేదు. అటువంటి సమయంలో మాత్రం ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. ఆ పార్టీకి 16 ఎంపీ సీట్లు దక్కగా.. చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ మద్దతు తెలపడంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్ర మోడీకి 29 సంవత్సరాలు అవుతాయని అందుకే ఆయన ప్రధానిగా మరోసారి బాధ్యతలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు అన్నది ఈ కథనం సారాంశం. అయితే నరేంద్ర మోడీ పక్కకు తప్పుకుంటే ఎవరు ఉంటారు అనేది ఒక ప్రశ్న. అయితే నరేంద్ర మోడీ తర్వాత ఆ బాధ్యతలు తీసుకునేందుకు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పద్నావిస్ అర్హత కలిగిన వారంటూ ఈ కథనంలో ఉంది. అయితే నరేంద్ర మోడీ తర్వాత అత్యంత బలమైన నేతగా యోగి ఆదిత్యనాథ్ పేరు ఉంటుంది. కానీ ఆయన పేరును పరిగణలోకి తీసుకోకుండా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ విషయంలో ఊహించినదే..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధానిగా రాహుల్ గాంధీ( Rahul Gandhi) అయ్యే అవకాశం ఉంది అని ఈ కథనంలో పేర్కొన్నారు. ఇది సాధ్యమే. ఆపై అందరూ ఊహించినదే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా రాహుల్ ఉన్నారు. ఆ పార్టీలో అందరికీ ఆమోదయోగ్యుడు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీలో తరువాత స్థానం ఎవరిది అంటే ప్రియాంక గాంధీ. ఎందుకంటే ఈమె కూడా ఆ కుటుంబానికే చెందినవారు కావడంతో వారు ఆ పదవి చేపడతామంటే అడ్డు చెప్పేవారు లేరు. అయితే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. రోజురోజుకు బలహీన పడింది. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎవరూ నమ్మడం లేదు కూడా. కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అన్న విషయాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ పరపతితో..
ఒకవేళ బిజెపి కాకుండా మిత్రపక్షాలకు అవకాశం ఇస్తే ఎవరు ఎవరు అనేదానికి రాయిటర్స్( Raayiters) కథనంలో ప్రముఖంగా వినిపించిన పేరు చంద్రబాబు, నారా లోకేష్. అయితే ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్నగా మిగులుతోంది. ఎందుకంటే అప్పుడప్పుడే సంకీర్ణ యుగాలు నడిచిన సమయంలో ఐకే గుజ్రాల్, దేవే గౌడ లాంటి నేతలు ప్రధానులు అయ్యారు. అప్పట్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఈ 25 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. పైగా చంద్రబాబు వయస్సు మోడీ కంటే ఎక్కువ. 2029 ఎన్నికల నాటికి ఈయన వయసు సైతం 79 సంవత్సరాలు అవుతుంది. పోనీ లోకేష్ కు ఇస్తారు అనుకుంటే ఏ ప్రాతిపదికన? బిజెపి ఉండగా.. బిజెపికి బలమైన నేతలు ఉండగా.. లోకేష్ కు ఇస్తారనడం మాత్రం కాస్త అతిశయోక్తిగా ఉంది. అయితే ఢిల్లీలో చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. తెలుగుదేశం పార్టీని నమ్మదగిన మిత్రుడిగా కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. బహుశా ఈ కారణంతోనే ప్రధానిగా చంద్రబాబు, లోకేష్ పేరు వినిపించి ఉంటుంది. అంతకుమించిన కారణాలేవి ఇప్పుడు కనిపించడం లేదు కూడా.