Amravati Capital: అమరావతి రాజధాని( Amravati capital) విషయంలో వేగం పెరిగింది. ఒకవైపు అదనపు భూ సమీకరణకు అంగీకారం తెలుపుతూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నోటిఫికేషన్ సైతం విడుదల అయింది. 20వేల అదనపు భూములను సమీకరించేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు అమరావతిలో గవర్నర్ బంగ్లాకు సంబంధించి 169 కోట్లతో భారీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటికి మొన్ననే 25 జాతీయ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం ప్రారంభమైంది. మరో రెండు సంవత్సరాల్లో ఈ 25 ప్రాంతీయ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు గవర్నర్ బంగ్లాకు కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీని నిర్మాణం కూడా ప్రారంభించనుంది. దీంతో ఏకకాలంలో అమరావతి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్మాణాలు కొనసాగుతాయి. ఆపై ప్రైవేటు సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు నిర్మాణం జరగనుంది. ఈ మొత్తం నిర్మాణాలతో అమరావతికి కొత్త కళ రానుంది.
* నాబార్డు నుంచి ఏడు వేల కోట్లకు పైగా
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. నాబార్డ్( NABARD ) నుంచి మరో 7 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సైతం ఆమోదముద్ర వేసింది. ఏకకాలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన భవనాల నిర్మాణం జరపాలన్నది ప్రణాళిక. అయితే కేవలం రాజధాని అనే దానికంటే పర్యాటకంగాను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎటువంటి నిధుల కొరత లేకుండా చూడాలని చూస్తోంది. సైతం ఆసక్తిగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం పని సులువుగా జరుగుతోంది.
* గతానికి భిన్నంగా కేంద్రం..
గతానికి భిన్నంగా అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం చక్కగా నే స్పందిస్తోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో కలిసి వచ్చింది. అందుకే ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి. వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి సర్దుబాటు చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఆ నిధులు జమ జరుగుతుంది. ఇప్పుడు నాబార్డు నుంచి సైతం 7000 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదలకు మార్గం సుగమం అయింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2028 ద్వితీయార్ధానికి అమరావతిని ఒక రూపుకు తేవాలన్నది చంద్రబాబు సర్కారు ప్రణాళిక. 2029 మార్చి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ సమయానికి అమరావతిలో ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలి. అవి జరగాలంటే పుష్కలంగా, ఎటువంటి కొరత లేకుండా నిధులు ఉంచేలా చేయాలి. ఇప్పుడు కూటమి సర్కారు చేస్తోంది అదే.