BRS stand on Amaravati issue: అమరావతి( Amravati capital ) చట్టబద్ధత బిల్లుకు సంబంధించి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఇండియా కూటమి పార్టీలు అభ్యంతరం తెలుపలేదు. ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుగానే మద్దతు తెలిపింది. చివరకు టిడిపి అంటే శత్రుభావం ఉండే టి
బిఆర్ఎస్ సైతం మద్దతు తెలిపింది. ఇదే అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తోంది. అమరావతి రాజధాని కి మద్దతుగా గులాబీ పార్టీ గళం ఎత్తడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో అస్తిత్వాన్ని కోల్పోతున్న ఆ పార్టీ.. అంది వచ్చిన ఏ అవకాశాలను జార విడుచుకోవడం లేదు. అందులో భాగంగానే ఒక అవకాశం గా భావించి అమరావతి రాజధానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో మద్దతు
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్సభలో బిఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఆ పార్టీ అమరావతికి మద్దతు తెలపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. గులాబీ పార్టీ తన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలని భావించినప్పటికీ అది వీలు కాలేదు. కానీ అప్పట్లోనే కెసిఆర్ అమరావతి ఏకైక రాజధానిగా తమ మద్దతు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణలో అవసరం కోసమే..
తెలంగాణలో రాజకీయ అవసరాల కోసమే గులాబీ పార్టీ అమరావతికి మద్దతు తెలిపిందని విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఆంధ్ర సెటిలర్స్ అధికం. అమరావతి అనేది ఆంధ్రుల ఆత్మ గౌరవం గా మారింది. అటువంటి అమరావతిని వ్యతిరేకిస్తే సెటిలర్స్ పార్టీకి వ్యతిరేకం అవుతారని కెసిఆర్ కు తెలుసు. అందుకే ఏపీ ప్రజల సెంటిమెంటును గౌరవించడం ద్వారా.. తెలంగాణలోని తమ పట్టును కాపాడుకోవడానికి గులాబీ పార్టీ వ్యూహానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో మాత్రం వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విమర్శలకు తావిస్తోంది. స్నేహంగా ఉండే కెసిఆర్ పార్టీ కూడా అమరావతికి మద్దతు తెలపడంతో.. జగన్ వైసీపీ పార్టీ ఒంటరిగా మారింది.