Pawan Kalyan: ఆంధ్ర ప్రజలు అంటే తెలంగాణ నేతలకు ఎప్పుడు చులకన భావమే. ముఖ్యంగా కెసిఆర్ అండ్ కోకు ఎప్పుడు వ్యతిరేకమే. అయితే రాజకీయాల కోసమే అలా మాట్లాడుతుంటారు తప్ప ఇక్కడి ప్రజలు వారికి ఏం చేశారు. హైదరాబాద్ బిర్యానీ గురించి చెబుతూ ఏపీ ప్రజలను దొంగలతో పోల్చారు కెసిఆర్. అటు తరువాత అదే ఏపీ సీఎం జగన్ తో కలిసి రాజకీయాలు చేశారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ ప్రజల ఆగ్రహంతో కొట్టుకుపోయారు. అందుకే ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు అవకాశం లేదు. కానీ ఆ అవకాశాన్ని చేజేతులా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతుల సమస్యలను ప్రస్తావించే క్రమంలో.. యధాలాపంగా తెలంగాణ దిష్టి తగిలిందంటూ మాట్లాడారు. ఎందుకంటే కోనసీమ అందాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. తెలంగాణ ప్రజలు సైతం తమ రాష్ట్రంలో అటువంటి ప్రదేశం లేదు కదా అని చిన్నపాటి ఆవేదన. దానిని గుర్తు చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్. దానిని ఇప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు బి ఆర్ఎస్ నేతలు.
* సెంటిమెంట్ అస్త్రంతోనే..
తెలంగాణ ( Telangana) ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్కు ఎనలేని గుర్తింపు ఉంది. ప్రజల నాడిని పట్టిన కెసిఆర్ రెండుసార్లు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. రెండుసార్లు అధికారంలోకి రాగలిగారు. మూడోసారి ఢిల్లీ పీఠంపై కన్నేసి.. సెంటిమెంటును పక్కనపెట్టి టీఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మార్చి ఒక ప్రయోగం చేశారు. కానీ అది దారుణంగా వికటించింది. పార్టీ ఉనికి కూడా ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించడం.. కెసిఆర్ పార్టీ నేతలకు కొబ్బరి చిప్ప దొరికినట్లు అయింది. దీనిని సెంటిమెంట్ గా రగిలించే ప్రయత్నం వారు ప్రారంభించారు. కోనసీమ నుంచి ప్రజలు వచ్చి తెలంగాణలో బతుకుతున్నారు తప్ప.. తెలంగాణ ప్రజలు కోనసీమకు వెళ్లి బతకడం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఆ చిన్న కంటెంట్ తీసుకొని మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు.
* ప్రజలకు అన్నీ తెలుసు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు తొలగిపోయాయి. రెండు రాష్ట్రాల అభివృద్ధిని పరస్పరం ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ ను ప్రయోగిస్తామన్న కుదిరే పని కాదు. అందులో ఎత్తు పల్లాలు చూశారు ప్రజలు. ఎంత మాత్రం వారికి అవకాశం లేదు కూడా. అందునా పవన్ కళ్యాణ్ ద్వారా ఇటువంటి సెంటిమెంట్ పెడతామంటే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తారే తప్ప.. దానిని మరింత విస్తరించరు. తమ పార్టీ వారిని సైతం కట్టడి చేస్తారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ నేతలకు ఇదో వనరుగా దొరికింది. దానిపై ఎంతగా మాట్లాడాలో అంతలా మాట్లాడుతారు. కానీ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.