Homeఆంధ్రప్రదేశ్‌Brother Anil: బ్రదర్ అనిల్ సంచలన నిజం

Brother Anil: బ్రదర్ అనిల్ సంచలన నిజం

Brother Anil: ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఆయన కుమారుడు సీఎం జగన్ ఒకవైపు, రాజకీయ ప్రత్యర్థులు మరోవైపు ఉండగా.. వైయస్ షర్మిల మెరుపులు మెరిపిస్తున్నారు. సోదరుడు జగన్ ని టార్గెట్ చేసుకున్నారు.దీంతో జగన్,షర్మిల మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. పెద్ద యుద్ధమే నడుస్తోంది. వారి మధ్య చిన్న పాటి మాటలను సైతం భూతద్దంలో పెడుతున్నారు. ముఖ్యంగా ఎల్లో మీడియా ఆ కుటుంబ రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. పతాక శీర్షికన కథనాలు రాస్తోంది. తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ కడపలో ఓ చర్చిలో రాజకీయ ప్రసంగం చేసినట్లు రాసుకొచ్చింది. పాపులను శిక్షించాలి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేసినట్లు ఎల్లో మీడియాలో వచ్చింది.

బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రబోధకుడు. వైయస్ షర్మిల భర్త. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేరు తరచూ వినిపించింది. అటు జగన్ పార్టీ పెట్టినప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోసం బ్రదర్ అనిల్ కుమార్ మత రాజకీయాలు చేశారన్న విమర్శ ఉంది. ఇప్పుడు సోదరుడు జగన్ ను షర్మిల రాజకీయంగా విభేదించడం వెనుక బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉందని ప్రచారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా సోదరుడిపై గట్టి పోరాటమే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లో మీడియాలో షర్మిల తో పాటు కుటుంబంలోని జగన్ వ్యతిరేకులకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అందులో భాగంగా షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ తో జగన్ కు దారుణంగా దెబ్బ తప్పదనిఎల్లో మీడియా కథనాలు రాసుకోస్తోంది. తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ పులివెందులలో ఓ చర్చిలో మత ప్రసంగం చేశారని.. పాపులను యేసు శిక్షిస్తాడంటూ వ్యాఖ్యలు చేశారని ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చింది.

అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండగా ఒక చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ రాజకీయ ప్రసంగం చేశారని తెలియడం సంచలనం గా మారింది. అయితే దీనిపై తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ స్పందించారు. తాను రాజకీయ ప్రసంగం చేయలేదని తేల్చి చెప్పారు. కేవలం తాను పాములను, తేళ్లను శిక్షించాలని మాత్రమే అన్నానని.. అది బైబిల్లో ఉందని.. దానిని పాపులు అంటూ చిత్రీకరించారని ఆయన చెబుతున్నారు. తన ప్రార్ధనల వల్లే రాజశేఖర్ రెడ్డి, జగన్లు గెలిచారని తాను ఎన్నడూ అనలేదని.. అది అవాస్తవంగా పేర్కొన్నారు. తాను మత ప్రబోధకుడిని మాత్రమేనని.. మతం పేరిట రాజకీయాలు చేయనని కూడా తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇటువంటి పనులు చేయలేదని.. భవిష్యత్తులో కూడా అటువంటివి చేయనని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పడం సంచలనం గా మారింది. ప్రస్తుతం బ్రదర్ అనిల్ కుమార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version