Botsa Satyanarayana: గంటాను వెతుక్కుంటూ భీమిలికి బొత్స

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపు పొందారు. పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి డీలా పడ్డారు. పార్టీలో ఉన్నామా? లేదా అన్నట్టు నెట్టుకొచ్చారు.

Written By: Dharma, Updated On : March 1, 2024 12:56 pm
Follow us on

Botsa Satyanarayana: రాజకీయాలు అన్నాక స్థానిక అంశాలు చాలా వరకు పనిచేస్తాయి. స్థాన బలం ఉంటే రాజకీయాల్లో ఇట్టే రాణించవచ్చు. కానీ స్థాన బలం లేకుండా.. నియోజకవర్గాలను మార్చుతూ గంటా శ్రీనివాసరావు గెలుపొం దుతూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో.. నాలుగు చోట్ల నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. అందుకే ఈసారి చంద్రబాబు ఆ ఆలోచనతోనే చీపురుపల్లి వెళ్లాలని గంటాకు సూచించారు. కానీ గంటా అందుకు ససేమీరా అంటున్నారు. అక్కడ బలమైన అభ్యర్థి బొత్స ప్రత్యర్థి కావడమే అందుకు కారణం. అయితే గంటా శ్రీనివాసరావును వెతుక్కుంటూ బొత్స రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపు పొందారు. పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి డీలా పడ్డారు. పార్టీలో ఉన్నామా? లేదా అన్నట్టు నెట్టుకొచ్చారు. ఎన్నికల ముంగిట యాక్టివ్ అయ్యారు. అందుకే గంటా శ్రీనివాసరావు పట్ల టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉంది. కానీ బలమైన నేత కావడం, గెలుపు గుర్రం కావడంతో టిడిపి శ్రేణులు సర్దుకున్నాయి. కానీ ఈసారి గంటా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటు జనసేన ఆశిస్తోంది. అందుకే చంద్రబాబు గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారు. కానీ అక్కడ వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. బలమైన అభ్యర్థి కావడంతో తాను అక్కడికి వెళ్ళనని గంటా తేల్చి చెప్పారు.

అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ సైతం వేరే ఆలోచనతో ఉన్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ స్థానం పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని బొత్స కోరారు. అందుకు అంగీకరిస్తేనే తన భార్య ఎంపీగా పోటీ చేస్తుందని జగన్ కు బొత్స తేల్చి చెప్పారు. అదే సమయంలో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేస్తే.. ఎంపీగా కలిసి వస్తుందని బొత్స ఆలోచన చేస్తున్నారు. అందుకు జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే చంద్రబాబు సైతం వ్యూహం మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు గంటా భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించడం.. ఇప్పుడు అదే స్థానాన్ని కోరుకోవడం తో.. భీమిలి నియోజకవర్గాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.