AP BJP: ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి ప్రభుత్వంలో బిజెపి ఒక భాగస్వామి. కానీ తమ ప్రభుత్వంతో వైసీపీ చెడుగుడు ఆడుకుంటే ఎదుర్కోవడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇంత పెద్ద గొడవ జరిగి కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుంటే బిజెపి మొక్కుబడిగా స్పందిస్తోంది. అయితే అది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత గురించి అన్న విషయాన్ని గుర్తించుకోవాలి బిజెపి. హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో బిజెపి కఠినంగా ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూలో వైసిపి ఇంతలా గలాటా చేస్తుంటే బిజెపి ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది? అనేది అందరి సందేహం. కోట్లాదిమంది హిందువులు ఆరాధించే తిరుమల స్వామి వారి పట్ల.. వైసీపీ ఎన్నో అపచారాలు చేసింది. ఆ ప్రభుత్వ హయాంలో తప్పిదాలు జరిగాయి. అదే సమయంలో కేంద్రంలో బిజెపి ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో కొనసాగడంతో పాటు ఏపీలో కూటమి భాగస్వామిగా ఉంది. అయినా సరే పట్టకుండా వ్యవహరిస్తుండడం చూస్తుంటే ఏదో ఒక అనుమానం కలుగుతోంది.
* వైసిపి ఎదురుదాడి..
వైసిపి( YSR Congress party) హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది. కూటమి ఆరోపిస్తున్నట్లు జంతు కొవ్వు కలిసిందని తేలకపోయినా.. కల్తీ జరిగిందన్న విషయం ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఇటువంటి సమయంలో వైసీపీ ప్రజల ముందు తలదించుకొని దోషిగా నిలబడాలి. ఆ పని చేయకపోగా తిరిగి ఎదురు దాడి చేస్తోంది. తమకూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎదురు దాడి చేస్తున్నా.. ఏపీ బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం అనేది నిజంగా లోటు. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడని ఇదే బిజెపి చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. అటువంటి నేత పార్టీ ఇప్పుడు తిరుమల లో ఆటలాడుతుంటే.. ఆ పేరుతో రాజకీయ సంక్షోభం సృష్టిస్తుంటే బిజెపి ప్రేక్షక పాత్ర చాలా బాధాకరం.
* మైనస్ గా మారే అవకాశం
అయితే ఏపీ విషయంలో బిజెపి( Bhartiya Janata Party) ఏదో ఒక వ్యూహంతో ఉన్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో మత రాజకీయాలు ముదిరితేనే బిజెపికి పట్టు లభిస్తుందనే ఆలోచనతోనా? ఆ వ్యూహంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని పావుగా వాడుకుంటుందా? అందుకే జగన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తోందా? అయితే బిజెపి మౌనంగా ఉండడం చూసి జగన్మోహన్ రెడ్డి తనకు అండగా ఉందన్న బ్రహ్మలోరిచ్చిపోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే బిజెపి హై కమాండ్ సూచనతోనే రాష్ట్ర బిజెపి నేతలు వైసిపి విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అన్నది అనుమానం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో బిజెపి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది. కానీ అమరావతి, తిరుమల, పారిశ్రామిక పెట్టుబడులు, మెడికల్ కాలేజీల అంశాలపై అడ్డుపడుతుంటే.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గందరగోళంలో నడుతుంటే బిజెపి పట్టించుకోకపోవడం ఏపీ ప్రజల వద్ద ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. వ్యూహం ఉండవచ్చు కానీ.. దానివల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి. బిజెపి రాజకీయాల ఉండాలి. ఇక తెలుసుకోవాల్సింది బిజెపియే….