https://oktelugu.com/

Subramanya Swamy: బిజెపితో కొనసాగుతున్న వైసీపీ సఖ్యత.. నేరుగా సపోర్ట్ చేస్తున్న ఆ నేత

గత ఐదేళ్ల కాలంలో బిజెపికి వైసిపి అన్ని విధాలా సహకరించింది. అటు బిజెపి సైతం వైసీపీకి రాజకీయ సహకారాన్ని పరోక్షంగా అందించింది. కానీ ఇప్పుడు అలా చేస్తామంటే కుదరదు. రాష్ట్రంలో బిజెపి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అటు కేంద్రంలో సైతం తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో బిజెపి నేత ఒక్కరు బాహటంగానే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2024 / 03:20 PM IST

    Subramanya Swamy

    Follow us on

    Subramanya Swamy: వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత ఐదేళ్ల కాలంలో బిజెపి జగన్ కు ఎన్నో విధాలుగా అండగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది. ఈ తరుణంలో బిజెపి నుంచి సరైన సహకారం జగన్ కు లభించడం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వైసీపీకి అండగా నిలుస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డు వ్యవహారంలో వైసిపి కార్నర్ అయ్యింది. ఆ పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగింది. బిజెపి హై కమాండ్ వైసీపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ఒకే ఒక బీజేపీ నేత ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఆయనే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు వైసిపి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ ముప్పేట దాడిని ఎదుర్కొంది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అష్ట కష్టాలు పడింది. చివరకు ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో సుబ్రహ్మణ్యస్వామి సైతం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ నుంచి ఇద్దరిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరిని, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒకరిని సీట్ లో ఉండాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వైసిపి కోరినట్టు నేరుగా కేంద్రం దర్యాప్తు చేయలేదు. అటు ఏపీ ప్రభుత్వానికి సైతం భాగస్వామ్యం కల్పించింది. వైసీపీలో అసహనానికి ఇదే కారణం. అయితే ఏపీలో వైసీపీకి అండగా నిలుస్తున్నారు బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి జగన్ కు అండగా నిలిచారు స్వామి. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు.

    * చాలాసార్లు అండగా
    అయితే సుబ్రహ్మణ్యస్వామి వైసీపీకి అండగా నిలవడం ఇదే తొలిసారి కాదు. టీటీడీ చైర్మన్లు గా వైవి సుబ్బారెడ్డి తో పాటు కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. వారిద్దరిపై అన్య మత ప్రచారం జరిగింది. అప్పట్లో కూడా సుబ్రమణ్య స్వామి వైసీపీకి అండగా నిలిచారు. క్లీన్ చీటీ ఇచ్చారు. ఆయన పేరుకే బిజెపికి చెందిన వ్యక్తి. చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తారు అన్న పేరు ఉంది. పైగా విద్యాధికుడు కూడా. గతంలో వైసిపి పై విమర్శలు వచ్చిన ప్రతిసారి అండగా నిలిచారు ఆయన. ఇప్పుడు కూడా వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో రంగంలోకి దిగారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి విషయంలో బిజెపి వైఖరి వేరేలా ఉంది. ఆయన నిజమైన బిజెపి వాది కాదన్నది వారి ఆరోపణ.

    * వైసీపీకి మద్దతుగా పిటిషన్లు
    తిరుమల లడ్డు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి తో పాటు సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లు దాఖలు చేశారు. అప్పుడే ఆయన వైసీపీ మనిషి అని టిడిపి అనుమానించడం ప్రారంభించింది. అలాగని బిజెపి హై కమాండ్ సుబ్రహ్మణ్యస్వామిని పట్టించుకునే పరిస్థితి లేదు. కొద్ది సంవత్సరాల కిందటే సుబ్రహ్మణ్యస్వామి తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. రాజ్యసభ పదవిని సైతం పొందారు. అయితే రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం రెన్యువల్ ఇవ్వలేదు. మరోవైపు వైసీపీ నుంచి ఆయనకు ప్రత్యేక నజరానా అందుతుందన్నది టిడిపి నుంచి వచ్చే ఆరోపణ. అందుకే ఇప్పుడు జాతీయస్థాయిలో బిజెపి పట్టించుకోకపోయేసరికి.. సుబ్రమణ్య స్వామి సాయాన్ని వైసిపి కోరుకున్నట్లు ప్రచారం సాగుతోంది.మొత్తానికైతే వైసిపి క్లిష్ట సమయంలో ఉండగా.. బిజెపి నేత సహకారం దొరకడం విశేషం.