Big deal in Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. డ్రోన్ల రంగంపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇవ్వడంతో పాటు 500 అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడునుంది. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సదరు సంస్థ సహకరించనుంది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. తాజాగా జరిగిన ఒప్పందంతో ఏపీకి ఎంతో ప్రయోజనం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆయన సమక్షంలోనే ఎన్విడియా ప్రతినిధులు, ఏపీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది.
* ఒప్పందం ఖరారు
తాజా ఒప్పందం ప్రకారం పదివేల మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై( artificial intelligence) శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏపీఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే 500 అంకుర పరిశ్రమల ఏర్పాటుకు సైతం మద్దతు ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న తరుణంలో.. ఈ ఒప్పందం ఏపీ భవిష్యత్తును మార్చబోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ త్వరలో పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* మంత్రి లోకేష్ చొరవతో..
గత ఏడాది అక్టోబర్ లోనే ఎన్విడియా సీఈవో( Nvidia CEO ) జెన్సన్ హువాంగ్ తో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి సహకరించాలని కోరారు. అప్పట్లో ఎన్వీడియో సీఈవో దానికి అంగీకరించారు. దానిపైనే తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పదివేల మంది ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ట్రైనింగ్ అందించనున్నారు. దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకోవైపు అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే తొలిసారిగా దేశంలో ఏర్పాటైన పార్కుగా ఇది నిలవనుంది. ఇందుకోసం టిసిఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టి సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2026 జనవరి నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అమరావతిలో భూమిని కూడా కేటాయించారు. ఉద్దండ రాయుని పాలెం, లింగాయపాలెం ప్రాంతంలో 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అయితే ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యమిస్తున్న తరుణంలో.. ఈ భారీ ఒప్పందం జరగడం విశేషం.