Balakrishna: బాలయ్య మళ్ళీ బుక్ అయ్యాడు.. వైరల్ వీడియో

ఇటీవల తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేన కలిసి సంయుక్తంగా సభ నిర్వహించాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత బాలకృష్ణకు అవకాశం ఇచ్చారు.

Written By: Suresh, Updated On : March 5, 2024 1:57 pm

Balakrishna

Follow us on

Balakrishna: బాలయ్య.. ఈ పేరు చెప్తే.. పౌరాణికం, జానపదం, యాక్షన్, ఫ్యాక్షన్.. ఇంకా ఎన్నో రకాల ఇతివృత్తాలతో నటించిన సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మంగమ్మగారి మనవడు, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్, అఖండ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు చిత్ర సీమలో ఏ కథానాయకుడికి లేనటువంటి అభిమాన సంఘాలు బాలకృష్ణకు మాత్రమే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి బాలకృష్ణ తెరమీద గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తారు. కత్తితో కాదు కంటిచూపుతో చంపేస్తా.. ఫ్లూటో జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. ఇంకా చాలా బహుళ ప్రజాదరణ డైలాగులు బాలకృష్ణ నోటి వెంట వచ్చాయి. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. కానీ అదే బాలకృష్ణ తెర ముందు మాట్లాడితే అదోరకంగా ఉంటుంది. ఈ మాట అంటున్నది మేము కాదు నెటిజన్లు.

ఇటీవల తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేన కలిసి సంయుక్తంగా సభ నిర్వహించాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత బాలకృష్ణకు అవకాశం ఇచ్చారు. సాధారణంగా తెలుగు భాష మీద అపారమైన పట్టు బాలకృష్ణ కు సొంతం. అయితే ఆ తెలుగు పదాలకు బదులుగా సంస్కృత పదాలు పలకడం వల్ల బాలకృష్ణకు అంతగా నోరు తిరగదు. ఆయనకు తెలుగు పట్ల ఉన్న అభిమానానికి చప్పట్లు కొట్టాల్సిందే. కానీ ఆయన కఠినమైన పదాలు పలకడం వల్ల జనాలకు అర్థం కాదు. పైగా వాటిని పలికే సమయంలో బాలకృష్ణ చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో అసలు అర్థం మారిపోయి, ఏం చెప్తున్నాడో అంతు పట్టదని ప్రజలు అంటుంటారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఇటీవల బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వైసీపీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.”బాలయ్య భాష ఇలానే ఉంటుంది. దానిని అంత ఈజీగా అర్థం చేసుకోలేం” అని కొంతమంది కామెంట్ చేస్తుండగా..” నోరు పలకనప్పుడు అలాంటి కఠినమైన పదాలు ఎందుకు ప్రయోగించాలని” మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి అనుకూల నెటిజన్లు జగన్ మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో అటు వైసిపి, ఇటు టిడిపి నెటిజన్లు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు.